బండి సంజయ్ కోసం నిప్పంటించుకున్నాడు.. చివరికి..!

ఇటీవలే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయిన విషయం తెలిసిందే. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ అరెస్ట్ మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ను వ్యతిరేకిస్తూ ఎంతోమంది బీజేపీ శ్రేణులు నిరసనలు ఆందోళనలు చేపడుతున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ముందుకు వచ్చిన బిజెపి కార్యకర్త అందరూ చూస్తుండగానే ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు.

దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి హైదరాబాద్ బిజెపి కార్యాలయం ముందు ఆకస్మాత్తుగా చేరుకొని ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని మంటల్లో కాలిపోతున్న సమయంలో బిజెపి జిందాబాద్ బండి సంజయ్ అంటే తనకు ప్రాణం అంటూ నినాదాలు చేశాడు. అంతే కాకుండా బండి సంజయ్ ను వెంటనే విడుదల చేయాలని… టిఆర్ఎస్ ప్రభుత్వం బండి సంజయ్ ని ఏమీ చేయలేదు అంటూ వ్యాఖ్యానించాడు. వెంటనే అప్రమత్తమైన బిజెపి షెడ్యూల్ లో మంటలు ఆర్పి ఆస్పత్రికి తీసుకెళ్లారు