ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో ఫార్ములా – ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్.. టికెట్లు ధరలు ఇవే

-

ఫిబ్రవరి 11 న హైదరాబాద్ లో ఫార్ములా – ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ జరుగనుంది. ఈ మేరకు రేసింగ్ టికెట్స్ విడుదల చేశారు తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్. రేసింగ్ చూడటానికి సాధారణ జనానికి అనుమతి ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్. నేటి నుంచి బుక్ మై షోలో అందుబాటులోకి టికెట్స్ ఉంటాయని.. క్యాటగిరి వారీగా 1000, 3500, 6000, 10000 వేలుగా టికెట్స్ ధర నిర్ధారించినట్లు పేర్కొన్నారు.

హైదరాబాద్ చాలా స్పీడ్ గా ఎదుగుతున్న సిటీ అని… ఐటీ.. ఇన్ఫ్రా.. రెసిడెన్షియల్.. ఇండస్ట్రియల్ గా గ్రో అవుతున్న సిటీ అని కొనియాడారు. వరల్డ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ కి అవార్డు వచ్చింది.. వరల్డ్ బెస్ట్ గ్రీన్ సిటీగా 25నగరాలను పక్కకు నెట్టి ముందు నిలిచిందని గుర్తు చేశారు. ఇవన్నీ హైదరాబాద్ లో రేస్ జరగడానికి రీజన్..అని, ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీ గా ఈ రేస్ జరుగుతుందని పేర్కొన్నారు తెలంగాణ స్పెషల్ సీఎస్ అరవింద్ కుమార్.

Read more RELATED
Recommended to you

Latest news