హైదరాబాద్ నుండి షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వర్ టూర్…!

-

మీరు షిరిడీ వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే ఈ టూర్ ప్యాకేజీ ని చూడాల్సిందే. సాయిబాబా దర్శనం తో పాటు మీరు నాసిక్, త్రయంబకేశ్వర్ కూడా చూసి వచ్చేయచ్చు. ఈ ప్రదేశాలని చూసి రావడానికి IRCTC ఓ ప్యాకేజీని తీసుకు వచ్చింది. ఇక ఈ టూర్ ప్యాకేజీ వివరాలని చూస్తే..

షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వర్ ఈ ప్యాకేజీ లో కవర్ అవుతాయి. హైదరాబాద్ నుండి మీరు షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వర్ చూడచ్చు. రెండు రోజుల్లో ఈ మూడు ప్రాంతాలను చూసి రావచ్చు. ఈ ప్యాకేజీ ధర విషయానికి వస్తే.. రూ.3,100 మాత్రమే. ఈ ప్యాకేజీ వివరాలను చూస్తే.. ప్రతీ శనివారం టూర్ ఉంటుంది. మొదటిరోజు పర్యాటకులు హైదరాబాద్‌లోని టూరిస్ట్ బస్సు ఎక్కాలి.

రెండవ రోజు ఉదయం 7.30 గంటలకు షిరిడీ చేరుకుంటారు. ఆ తరవాత సొంత ఖర్చులతోనే సాయిబాబా ఆలయాన్ని చూడచ్చు. మూడో రోజు నాసిక్, త్రయంబకేశ్వర్ ఉంటుంది. జ్యోతిర్లింగ ఆలయ దర్శనం అయ్యాక హైదరాబాద్ కి జర్నీ స్టార్ట్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం హైదరాబాద్
రీచ్ అవుతారు. ఈ టూర్ ముగుస్తుంది. పెద్దలకు రూ.3,100, పిల్లలకు రూ.2,530 చెల్లించాలి. ఇదే కాక ఇంకో ప్యాకేజీ కూడా వుంది. ఈ టూర్ ప్యాకేజీ ధర రూ.2400. కానీ కేవలం షిరిడీ మాత్రమే కవర్ అవుతుంది. ఇంకే ప్రదేశాలు కవర్ అవ్వవు. https://tourism.telangana.gov.in/ వెబ్‌సైట్‌ లో పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news