హైపర్‌టెన్సివ్ రెటినోపతి: హైబీపీతో కంటి చూపు కోల్పేయే ప్రమాదం ఉందా..?

-

డయబెటిస్‌తో కంటి చూపుకు ప్రమాదం ఉంటుందని మనకు తెలుసు.. హైబీపీతో కూడా కంటిచూపు ప్రమాదంలో ఉంటుందని మీకు తెలుసా..? అధిక రక్తపోటు లక్షణాలు బయటకు కనిపించే సరికి శరీరం చాలా దెబ్బతిని ఉంటుంది. అన్‌ కంట్రోల్డ్‌ హై బ్లడ్‌ ప్రెజర్‌ వైకల్యాన్ని కలిగిస్తుంది. కళ్ళకు రక్తాన్ని సరఫరా చేసే చిన్న, సున్నితమైన రక్త నాళాలను దెబ్బతీస్తుంది. హైపర్‌ టెన్షన్ రెటీనాలోని రక్తనాళాలకు, కంటి వెనుక భాగంలో ఇమేజెస్‌ను ఫోకస్‌ చేసే ప్రాంతంపై ప్రభావం చూపుతుంది. ఈ కంటి వ్యాధిని హైపర్‌టెన్సివ్ రెటినోపతి అంటారు.

హైపర్‌టెన్సివ్ రెటినోపతి వల్ల ఏం జరుగుతుంది..

కళ్లపై అధిక రక్తపోటు అన్ని విధాలుగా ప్రభావం చూపుతుంది
రెటీనాలోని రక్త నాళాలు దెబ్బతినడం
కంటి వెనుక (రెటీనా) లైట్‌-సెన్సిటివ్‌ కణజాలంలో రక్త నాళాలు దెబ్బతినడం వల్ల కంటిలో రక్తస్రావం, అస్పష్టమైన దృష్టి, దృష్టి కోల్పోవడం జరుగుతాయి.
రెటీనాకు రక్త ప్రసరణ లేకపోవడం అస్పష్టమైన దృష్టికి, పూర్తిగా దృష్టిని కోల్పోయేలా చేస్తుంది.
రెటీనా కింద ద్రవం పేరుకుపోవడం. ఇది కంటి చూపు వక్రీకరణకు కారణమవుతుంది.

నరాల డ్యామేజ్‌

బ్లాక్‌ అయిన రక్త ప్రవాహం ఆప్టిక్ నాడిని దెబ్బతీస్తుంది, ఇది పార్షియల్‌ ఫీల్డ్‌ లాస్‌ లేదా పూర్తి చూపును కోల్పోవడానికి కారణమవుతుంది.

స్ట్రోక్, కంటిపై ప్రభావం

కంటికి సంబంధించిన అంశాలను నాశనం చేసి దృష్టి లోపాలకు కారణమవడంతో పాటు, అధిక రక్తపోటు స్ట్రోక్‌కు కారణమవుతుంది. ఇది ఆప్టిక్ నాడిని దెబ్బతీస్తుంది లేదా ఇమేజెస్‌ను ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహించే మెదడు ప్రాంతంపై ప్రభావం చూపుతుంది.

హైపర్‌టెన్సివ్ రెటినోపతి లక్షణాలు

సాధారణంగా హైపర్‌టెన్సివ్ రెటినోపతిలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కంటి పరీక్ష సమయంలో మాత్రమే దీన్ని కనుగొంటారు. మరింత తీవ్రమైన, వేగవంతమైన రక్తపోటు ఉంటే తలనొప్పి, కంటి చూపు సక్రమంగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

హైపర్‌టెన్సివ్ రెటినోపతి సంకేతాలు

అంతిమ-అవయవ నష్టం (ఎడమ జఠరిక హైపర్‌ట్రోఫీ, మూత్రపిండ బలహీనత వంటివి)
రక్తప్రసరణ గుండె వైఫల్యం
స్ట్రోక్, కార్డియోవాస్కులర్ మరణాల వంటి ప్రమాదాలకు సూచన కావచ్చు.

హైపర్‌టెన్సివ్ రెటినోపతి చికిత్స

హైపర్‌టెన్సివ్ రెటినోపతికి చికిత్స చేయడానికి ముందు రక్తపోటును తగినంతగా నియంత్రించడం.
ఆరోగ్యకరమైన జీవనశైలి, ఉప్పును తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి మందులు తీసుకోవడం వంటి వాటితో రక్తపోటు అదుపులో ఉంటుంది.
నాన్- డయాబెటిక్, సాధారణ ప్రజలైన పెద్దల్లో 10 శాతం మందిలో హైపర్‌టెన్సివ్ రెటినోపతి లక్షణాలు ఉన్నట్లు అధ్యయనాలు రుజువు చేశాయని గుర్తుంచుకోవాలి. కంటికి సంబంధించిన ఏదైనా సమస్య సంభవించే ముందు నయం చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి

Read more RELATED
Recommended to you

Latest news