చిరంజీవి గురించి నేనెప్పుడూ అలా మాట్లాడలేదు.. క్లారిటీ ఇచ్చిన వర్మ..!

కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల కాలంలో వివాదాలకు ఈయన మరీ ఎక్కువగా గురి అవుతున్నాడు. సోషల్ మీడియా వేదికదా ఏం మాట్లాడినా సరే ఆ విషయం పెద్ద ఎత్తున వివాదాలకు కారణమవుతూ వస్తోంది. ఇలా సోషల్ మీడియా వేదికగా వీడియో లేదా ఇంటర్వ్యూలు అయినా సరే రాంగోపాల్ వర్మ చేసే కామెంట్లు క్షణాలలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. తాజాగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన డేంజరస్ సినిమా ఈనెల తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు వర్మ ఈ ఇంటర్వ్యూలో భాగంగా వర్మ మాట్లాడుతూ మెగాస్టార్ గురించి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. నేను చిరంజీవి గారి గురించి ఎప్పుడు మాట్లాడినా ఆయన గురించి ఏ పోస్ట్ చేసినా ఒక దర్శకుడిగా కాకుండా ఒక అభిమానిగానే ఆయన గురించి పోస్ట్ పెట్టేవాడిని అంటూ తెలిపారు.

చిరంజీవి రీ ఎంట్రీ ఖైదీనెంబర్ 150 సినిమా చిరంజీవి గురించి వర్మ చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా వర్మ స్పందించడం జరిగింది. ఇలాంటి స్టార్ హీరో ఇలాంటి చిన్న సినిమాలో నటించడం ఏమిటి? బాహుబలి లాంటి సినిమాలలో నటిస్తే బాగుండు అని అన్నాను. ఒక అభిమానిగా నా అభిప్రాయాన్ని నేను చెప్పాను అంటూ వెల్లడించారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.