ఎక్కడ చూసినా చైనా బజార్లే.. మేకిన్‌ ఇండియా బజార్‌ ఎక్కడపాయే : సీఎం కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మోత గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. మేకిన్ ఇండియాపై చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ పేర్కొన్నారు కేసీఆర్. ఈ దేశంలో ఎక్క‌డంటే అక్క‌డ నేను చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు కేసీఆర్. మేకిన్ ఇండియాలో ఏం రాక‌పోయినా దేశంలో 10 వేల ప‌రిశ్ర‌మ‌లు మూతప‌డ్డాయి. ఎక్కడంటే అక్క‌డ నేను చ‌ర్చ‌కు సిద్ధం. ఈ దేశంలో ఏ న‌గ‌రంలో అంటే ఆ న‌గ‌రంలో చ‌ర్చ‌కు సిద్ధం. 50 ల‌క్ష‌ల మంది ఫ్యాక్ట‌రీ ఉద్యోగాలు ఊడిపోయాయి. సంవ‌త్స‌రానికి 10 ల‌క్ష‌ల మంది బ‌డా పెట్టుబ‌డిదారులు భార‌త‌దేశాన్ని వ‌దిలి బ‌య‌ట‌కు వెళ్తిపోతున్నారు. మేకిన్ ఇండియా అంటే అన్న‌వస్త్రానికి పోతే ఉన్న వ‌స్త్రం పోయింద‌న‌ట్టు ఉన్న‌వి ఊసిపోతున్నాయి త‌ప్ప కొత్త‌గా వ‌చ్చిందేమీ లేదు.

CM KCR: అందరి స‌మ‌ష్టి కృషితో.. దేశంలోనే అనేక విషయాల్లో నంబర్ వన్‌లో ఉన్నాం  - NTV Telugu

‘మేకిన్‌ ఇండియా ఏం కనిపిస్తుంది? కోరుట్ల మిషన్‌ దవాఖాన పక్కన చైనా బజార్‌. జగిత్యాల అంగడి గద్దెలకాడ చైనా బజార్‌. కరీంనగర్‌ సర్కస్‌గ్రౌండ్‌ చైనా బజార్‌. ఇదేనా మేకిన్‌ ఇండియా. మేకిన్‌ ఇండియా బజార్‌ ఎటువాయే? ఊరూరుకి చైనా బజార్‌ ఎందుకు రావట్టే. గోర్లు కత్తిరించుకునే నేయిల్‌ కట్టర్లు, గడ్డంగీసుకునే బ్లేడ్లు, కూసుండే కూర్చీలు, సోఫాలు, దీపావళి పటాకులు సైతం చైనా నుంచి రావాలా? ఎవరిని ప్రోత్సహిస్తున్నరు ? ఏం జరుగుతుందీ దేశంలో ? దీనిపై పెద్ద ఎత్తున ఆలోచన లేయాలే. లేకుంటే పెద్ద ఎత్తున దెబ్బతింటాం’ అంటూ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.