ఇటీవల తెలంగాణ రాష్ట్రాన్ని అకాల వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్రం మొత్తం భారీ వర్షాల లో తడిసి ముద్దయింది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రైతుల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఈ ఏడాది వర్షాల కారణంగా పంటలు బాగా పండాయని సంతోషంలో ఉన్న రైతులకు అకాల వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట దెబ్బ తినడంతో అయోమయంలో పడిపోయారు రైతన్నలు.
ఈ క్రమంలోనే దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటీవలి కాలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. తాను ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే సన్న రకం వరిని సాగు చేశానని కానీ ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట మొత్తం దెబ్బతింది అంటూ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే కే
సిఆర్ ఇప్పటికైనా తమను ఆదుకోవాలి అంటూ విజ్ఞప్తి చేశాడు కరీంనగర్కు చెందిన రైతు.