ప్రస్తుతం తెలుగు సినిమా లో వరలక్ష్మి శరత్ కుమార్ హవా నడుస్తోంది. తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు తమిళంలో కంటే తెలుగులో అవకాశాలు ఇస్తున్నారు. తాను వేసిన పాత్రలు తనకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. నాన్న పేరు నిలబెట్టింది అని ఆమెను పొగుడుతున్నారు.ఇప్పుడు ఇంతగా ఫామ్ లో వున్న వరలక్ష్మీ ఒకప్పుడు సినిమాలకు పనికి రాదని మొహం మీదనే చెప్పేశారట.
మొదట్లో ఈమె అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అనేక ప్రొడక్షన్ హౌస్ లకు తన ఫోటోస్, వీడియోస్ పంపిందట. చాలా మంది వాటిని పట్టించు కోలేదట. అప్పట్లో తన గొంతు విని ఇంత బొంగురు గొంతు సినిమాలకు పనికి రాదని చెప్పి, అవమానం గా ఫీల్ చేశారట. దీనితో వరలక్ష్మీ దానిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని తన యాక్టింగ్ మీద దృష్టి పెట్టి ఇప్పడు సౌత్ ఇండియా లో బిజీ ఆర్టిస్ట్ గా మారి పోయింది. ఇప్పుడు ఆమె గొంతే ఆమెకు ప్లస్ అయ్యింది.
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. మాస్ సినిమా వీరిసింహా రెడ్డి లో బాలయ్య కు ధీటుగా పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా లు ఉన్నాయి. అయితే ఆమె విలన్ పాత్రలు.. సహాయ నటిగా కనిపించడానికి గల కారణాలను బయటపెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వరలక్ష్మి తానకు గ్లామర్ పాత్రలు తనకు వర్కౌట్ కాదని భావించానని.. ప్రస్తుతం సినిమా పరిశ్రమ లో అలాంటి హీరోయిన్ గా చేయడానికి చాలా మంది ఉన్నారని.. అందుకే తాను లేడీ విలన్ గా, కారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి పాత్రలు ఎంచుకున్నానని తెలిపారు. ఇలాంటి కొన్ని పాత్రలు తానే చేయగలనని అనుకున్నానని చెప్పుకొచ్చింది.