తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్‌లను, డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను నియమితులయ్యారు. రిజిస్ట్రేషన్‌, స్టాంపుల కమిషనర్‌గా రాహుల్‌ బొజ్జాకు, రవాణా శాఖ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. విద్యాశాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను బదిలీ చేశారు.

Telangana government launches its own logo - BusinessToday

జీడీఏ కార్యదర్శిగా వి శేషాద్రికి, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు తెలంగాణ సర్కార్ అదనపు బాధ్యతలు అప్పగించింది. ఔషధ నియంత్రణ సంచాలకులుగా రిజ్వీకి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో రాష్ట్రంలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు.