కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తే మళ్లీ తెలంగాణ ఉద్యమం లాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం అవుతాయని అన్నారు. అమరావతి టు అరసవిల్లి యాత్ర ఒక ట్రాష్ అంటూ కొట్టి పడేశారు. అమరావతిలో బడుగు బలహీనవర్గాలు వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందని చంద్రబాబు ఆలోచిస్తున్నారని అన్నారు. రాజధాని లో చంద్రబాబు తన సామాజిక వర్గంతో భూములు కొనిపించారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే రెండో రోజు అమరావతి రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నేడు మంగళగిరి నుంచి దుగ్గిరాల వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. దుగ్గిరాలలో రైతులు నైట్ హాల్ట్ చేయనున్నారు. మూడవరోజు దుగ్గిరాల నుంచి వాళ్ళ యాత్ర ప్రారంభం కానుంది. నేడు రైతుల పాదయాత్రలో బిజెపి, కాంగ్రెస్, సిపిఐ నేతల బృందం పాల్గొంది.