బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఐటీ రైట్స్ ఉండవని కీలక వ్యాఖ్యలు చేశారు కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. దేశమంతా ఇన్కమ్ టాక్స్ రియలైజ్ చేస్తామన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఎంతైనా సంపాదించుకోవచ్చు అని.. ఎవరికి వారే పన్నులు చెల్లించేలా రూల్స్ తెస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ తన వెంట ఉన్నంతవరకు ఎవరికీ భయపడనని అన్నారు. ఇక బిఆర్ఎస్ తో దేశాన్ని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి మల్లారెడ్డి.
మల్లారెడ్డి తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇటీవల మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. మంత్రికి చెందిన విద్యాసంస్థలు, కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో తనిఖీలు చేశారు అధికారులు. ఈ తనిఖీలలో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సోదాల్లో భారీగా డబ్బు కూడా సీజ్ చేసినట్టు తెలుస్తోంది.