చంద్రబాబు కనిపిస్తే కొట్టండి.. అరకు ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కనిపిస్తే కొట్టాలని, తిట్టాలని ప్రజలను కోరారు. ఎమ్మెల్యే వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే శుక్రవారం హుకుంపేట మండలంలోని లోని తీగవలసలో పర్యటించారు.

ఈ సందర్భంగా కొందరు మహిళలు తమకు ఇళ్లు ఇప్పించాలని కోరారు. దీంతో స్పందించిన ఎమ్మెల్యే గిరిజనులకు ఇల్లు ఇచ్చేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కానీ వాటిని ఇవ్వకుండా చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అందువల్లే ఇల్లు ఇవ్వడం సాధ్యం కావడం లేదని అన్నారు. అంతేకాదు ఇల్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్న చంద్రబాబు కనిపిస్తే కొట్టాలని, తీట్టాలని వారికి సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news