టీడీపీ హయంలో అభివృద్ధి చూపిస్తే.. రాజ‌కీయాల్లో నుంచి త‌ప్ప‌కుంటా : గుడివాడ అమ‌ర‌నాథ్

-

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి కుటుంబం కంటే.. టీడీపీ హయంలో ఆంధ్ర ప్ర‌దేశ్ ఎక్కువ అభివృద్ధి జ‌రిగింద‌ని నిరూపిస్తే.. రాజ‌కీయాల్లో నుంచి శాశ్వ‌తంగా త‌ప్పుకుంటాన‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి గుడివా అమ‌ర‌నాథ్ రెడ్డి స‌వాల్ విసిరారు. ఏపీలో టీడీపీ అభివృద్ధి చేస్తే.. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు చంద్ర‌బాబును ఎందుకు వ్య‌తిరేకిస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కాగ రాజ‌ధాని విషయంలో శాస‌న స‌భ నిర్ణ‌యం తీసుకోరాద‌ని హై కోర్టు తీర్పును తాము గౌర‌విస్తామ‌ని అన్నారు.

అయితే ఇదే రాజ‌ధానిపై చంద్ర‌బాబు శాస‌న స‌భ‌లో నిర్ణ‌యం తీసుకోలేదా.. అని ప్ర‌శ్నించారు. ఈ తీర్పు వైసీపీకేనా… చంద్ర బాబుకు కాదా అని అన్నారు. అలాగే తాము మూడు రాజ‌ధానుల బిల్లు మ‌రోసారి తీసుకువ‌స్తామ‌ని తెల్చి చెప్పారు. అయితే ఆ బిల్లు ఈ స‌మావేశ‌ల్లోనా.. లేదా.. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోనా.. అనేది సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకుంటార‌ని అన్నారు. అలాగే బీజేపీ మేనిఫెస్టోలో క‌ర్నూలు ను న్యాయ రాజ‌ధానిగా చేస్తామ‌ని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు ప్ర‌జ‌లకు బీజేపీ ఏం స‌మాధానం చెబుతార‌ని బీజేపీని ప్ర‌శ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version