మనిషి అన్నాక ఏదోక టాలెంట్ వుంటుంది..కొందరు బయటకు తియ్యరు..కొంతమంది సోషల్ మీడియా ద్వారా బయట పెడుతున్నారు..ఇలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..మన దేశంలో ఇలా పాపులర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ ప్రతిభతో మంత్రముగ్ధుల్ని చేస్తుంటారు. సింగింగ్, మ్యూజిక్, డ్యాన్సింగ్, కుకింగ్..ఇలా ఏ రంగంలోనైనా తమలో ఉన్న నైపుణ్యాలకు పదును పెడుతుంటారు. దానిని ప్రదర్శించేందుకు సరైన అవకాశం వచ్చాక వారి పర్ ఫార్మెన్స్ తో అదర గొట్టేస్తారు. ఇందుకు సోషల్ మీడియా మంచి ప్లాట్ ఫామ్ గా ఉపయోగపడుతుంది.
చేతిలో మొబైల్, ఫోన్ లో డేటా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇన్ స్టా లో రీల్స్, యూ ట్యూబ్ లో షార్ట్స్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. తమ యాక్టింగ్, పర్ ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటారు. అయితే, కొంతమందికి మిమిక్రీలో ప్రావీణ్యం ఉంటుంది. వారు అనేక రకాల శబ్దాలను, సెలెబ్రిటీల వాయిస్ లను ఇమిటేట్ చేయగలరు. అటువంటి వీడియోలు చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..
వీడియోలో ఓ వ్యక్తి.. సంగీత పరికరాల ద్వారా వివిధ రకాల మ్యూజిక్ ప్లే చేయడాన్ని చూడవచ్చు. సంగీత వాయిద్యంతో పక్షి శబ్దం చేయడం, ఆపై పోలీసు సైరన్ మోగించడం మీరు చూడవచ్చు. అనంతరం ఎమర్జెన్సీ రెస్పాన్స్ సర్వీస్ 108 వాహనం సౌండ్ చేస్తాడు. అంతే కాకుండా ఆ రెండు స్వరాలను అనుకరించడాన్ని వీడియోలో గమనించవచ్చు..ఆఖరన అరుస్తున్న కుక్కలగా చేసి అందరినీ విస్మయానికి గురి చేశాడు..ఆ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ‘ప్రతిభకు హద్దు లేదు’ అనే క్యాప్షన్ ఇచ్చారు…నిజంగా చాలా బాగా చేశాడు మీరు ఒకసారి చూడండి..
Talent has no boundaries…
Source:wa pic.twitter.com/YhoPUtKKA2— Dr K Venkatesham IPS (retd) (@Venkatesham_IPS) November 16, 2022