ప్రతి ఒక్కరికి నిద్రలో కలలు రావడం సహజం నిద్రలో చాలా రకాలు కలలు వస్తూ ఉంటాయి. మనం ఏదైనా సినిమాని ఎక్కువ సేపు చూసినా వెబ్ సిరీస్ వంటివి చూసిన అవి మనకి కలలో కనపడుతూ ఉంటాయి. అలానే కలలో మనకి ఇష్టమైన వాళ్ళు.. మనకి ఇష్టమైనవి కనబడుతూ ఉంటాయి ఒక్కొక్క సారి కలలో మన పూర్వికులు కూడా కనబడుతుంటారు. చనిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కలలోకి వస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం కలలోకి పూర్వికులు వస్తే దానికి అర్థం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
చాలామంది హిందూ సంప్రదాయం ప్రకారం పాటిస్తారు వాళ్ళ పద్ధతి ప్రకారం వాళ్ళు నడుచుకుంటారు. మనిషి చనిపోయిన తర్వాత 15 రోజులలోపు కర్మ కాండలు పూర్తి చేయాలి. అలానే నెలకు ఒకసారి మాసికం ఇలా చేస్తూ ఉంటారు అయితే చనిపోయిన వాళ్ళు కనుక కలలో కనపడితే పూర్వికుల ఆశీస్సులు మనకు లభిస్తాయట. అగ్నిపురాణం గరుడు పురాణం వాయు పురాణంలో దీని గురించి రాశారు చనిపోయిన వాళ్లకి కార్యక్రమాలు చేయడం వలన మంచి జరుగుతుందట. కలలో పాములు కనబడితే చనిపోయిన వారి పూర్వికులు ఆశీస్సులు బలంగా ఉన్నాయని దానికి అర్థం.
పైగా కర్మలు చేసేటప్పుడు ఎవరికైనా అనుకోకుండా ధనం వచ్చినా ఎప్పటినుండో అనుకున్న పనులు పూర్తయిన కొత్త వ్యాపారాల మొదలుపెట్టిన దానికి కారణాలు చనిపోయిన పూర్వీకుల ఆశీస్సులు అని అర్థం చేసుకోవాలి. చనిపోయిన వాళ్ళు కలలో కనపడితే ఆనందంగా ఉన్నట్లు ఆశీర్వదించినట్లు కనపడితే అంతా మంచే జరుగుతుంది. ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు అనుకోకుండా ఎవరైనా పెద్దవాళ్లు సహాయాన్ని అందిస్తే చనిపోయిన పూర్వీకులు ఆశీస్సులు వల్ల అలా జరిగిందని భావించాలి.