మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదు – జీవన్ రెడ్డి

-

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కేసు కోర్టులో తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారని.. మరి భవిష్యత్తు ఏంటి? అని ప్రశ్నించారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ సభలను నిర్వహించకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించారని అన్నారు.

గ్రామంలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నా కూడా నివాసిత ప్రాంతాలైన రైతుల భూములను రిక్రియేషన్ కింద పరిగణిస్తున్నారని అన్నారు జీవన్ రెడ్డి. రెసిడెన్షియల్ భూమిని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. హస్నాబాద్, లింగంపెట్, అంబరిపెట చుట్టుప్రక్కల ప్రాంతాలు అన్ని నివసిత ప్రాంతాలేనన్నారు. 25జనవరి న మాస్టర్ ప్లాన్ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ పాలక వర్గం తీర్మానం చేసిన పూర్తి రద్దుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవన్నారు.

తాత్కాలిక నిలుపుదల పరిష్కారం కాదని.. దానికి పూర్తి స్తాయిలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. జగిత్యాల పరిసర గ్రామ రైతుల హక్కులు కాలరాయద్దన్నారు జీవన్ రెడ్డి. మాస్టర్ ప్లాన్ ని పూర్తి స్థాయి లో ఉపసంహరించుకోవాలన్నారు. మాస్టర్ ప్లాన్ పూర్తి స్థాయి రద్దుకు ఎమ్మెల్యే లు, మంత్రిని కలిసి పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. పాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news