ఆడపిల్లల చావులకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. హాజీపూర్ ఘటనలో బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదని.. అమ్మాయిలను రేప్ చేసి చంపిన శ్రీనివాస్ రెడ్డికి ఇంకా పూర్తిస్థాయిలో శిక్ష పడలేదని అన్నారు. అతడిని ఉరితీయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ తీర్పు ఇచ్చిన ఇంతవరకు అమలు కాలేదని, ఉరిశిక్ష అమలుకు హైకోర్టు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
ప్రీతి లాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయని, ఎన్కౌంటర్ చేస్తే మానవ హక్కుల వాళ్ళు గొడవ చేస్తారని అన్నారు. అమ్మాయిలు చనిపోయినప్పుడు మానవ హక్కుల వాళ్ళు ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. ప్రతి యూనివర్సిటీలో ర్యాగింగ్ పై నిఘా పెట్టాలన్నారు వి హనుమంతరావు. నేరం చేయాలంటే చస్తామనే భయం వచ్చేలా శిక్షలు ఉండాలన్నారు. నేరం చేసి నాలుగు రోజులు జైల్లో ఉండి రావచ్చు అనే ఫీలింగ్ వచ్చేట్లు చేశారని.. ఎక్స్గ్రేషియాలు ఇవ్వడం ఆపి నిందితులకు శిక్ష పడేలా చూడాలన్నారు.