చలికాలంలో మహిళలు ఈ టిప్స్ పాటిస్తే ఆరోగ్యం బాగుంటుంది..!

-

చలికాలంలో మహిళలు ఎన్నో రకాల సమస్యల వలన ఇబ్బంది పడుతుంటారు. చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు, ఎముకల సమస్యలు వంటివి. ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే మహిళలు చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం తీసుకునే ఆహారం, మనం ఫాలో అయ్యే జీవనశైలి బట్టి మన ఆరోగ్యం ఉంటుంది. అందుకని తీసుకునే ఆహారం పట్ల ప్రతి ఒక్కరూ తప్పక దృష్టి పెట్టాలి. లేదు అంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి.

విటమిన్ సి:

విటమిన్ సి వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది మనకి కమల, నిమ్మ, కివి, బొప్పాయి, జామ లో ఉంటుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఆకుకూరలు:

ఆకుకూరల్లో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఉంటుంది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం బాగుంటుంది.

గరం మసాలా:

మనం ఇంట్లో ఉపయోగించే కుంకుమ పువ్వు, పసుపు, దాల్చిని, యాలకలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. జలుబు ఫ్లూ రాకుండా ఇవి మనకు సహాయం చేస్తాయి. కాబట్టి వీటిని కూడా ఎక్కువగా వాడుతూ ఉండండి.

డ్రై ఫ్రూట్స్:

ఖర్జూరం, అంజీర్ కూడా చాలా మేలు చేస్తుంది. వీటిలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఎనర్జీని పెంచడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి.

నెయ్యి:

నెయ్యి కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఒళ్ళు చల్లబడకుండా వీటిని వేడిగా ఉంచుతుంది ఇలా మహిళలు కనుక తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడానికి వీలవుతుంది అలానే సమస్యలు కూడా రావు.

Read more RELATED
Recommended to you

Latest news