బరువు తగ్గాలని చాలామంది ఉదయం వేడినీళ్లు తాగుతుంటారు. అందులో నిమ్మరసం తేనె కూడా వేసుకుంటారు. మరికొందరు మూడు వచ్చినప్పుడు వెళ్లి ఒక గ్లాసు వేడి నీళ్లు తాగుతారు. అసలు వేడి నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా? దీని వల్ల ఏమాత్రం లాభాలు ఉన్నాయి..? నిపుణులు ఏమంటున్నారు.?
వేడి నీటిని తీసుకుంటే కచ్చితంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు వైద్యనిపుణులు. ప్రతి రోజూ ఉదయానే గ్లాసుడు వేడి నీళ్లు తాగితే అధిక బరువు తగ్గడం సులభంగా మారుతుంది. కేవలం బరువు తగ్గేందుకే కాదు వేడి నీళ్లు తాగడం వల్ల ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. వేడినీరైనా, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు…ఏ నీరైనా మంచిదే.
వేడి నీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కలిగితే, గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు తాగడం వల్ల మరికొన్ని లాభాలు ఉంటాయి. ఉదయానే ఖాళీ పొట్టతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. గోరువెచ్చని నీరు పొట్టలోకి వెళ్లగానే శరీరం దాని ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. జీవక్రియను ప్రారంభిస్తుంది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాదు పొట్టలోని వ్యర్థాలను బయటికి పంపడంలో, జీర్ణక్రియను మెరుగు పరచడంలో కూడా వేడి నీళ్లు మీకు సహాయపడతాయి.
శరీర కొవ్వును కరిగించడంలో కూడా వేడి నీళ్లు చాలా సహకరిస్తాయి. పోషకాహారం శోషణలో ఇది ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
నిద్రపోయే ముందు తాగొచ్చా..?
నిద్ర సరిగా పట్టని వారికి వేడి నీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయట.. నిద్రపోయే ముందు గ్లాసు వేడినీళ్లు తాగితే త్వరగా నిద్రపట్టే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలాగే ఊబకాయం, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారు కూడా వేడినీళ్లు రాత్రిపూట తాగితే బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా వేడి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా త్వరగా తగ్గుతాయి. కాబట్టి..వేడినీళ్లు తాగడం వల్ల ఎలాంటి నష్టమూ లేదూ.. రోజూ ఉదయాన్ని లేవగానే ఒక గ్లాసుడు వేడి నీళ్లు తాగడం ఇప్పటినుంచే అలవాటు చేసుకోండి.!