International Beer Day: బీర్ తాగితే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలిస్తే అస్సలు వదలరు..!!

-

బీరు.. ఈ పేరు వినగానే మందుబాబులకు నోరు ఊరి పోతుంది..చిన్న పార్టీల నుంచి పెద్ద పెద్ద ఫంక్షన్ల లో కూడా బీరు పొంగాల్సిందె..అయితే ఈ బీరు గురించి అందరికి తెలుసు కానీ,దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా మందికి తెలియదు..ఇప్పుడు ఆ ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు..ఇప్పుడు అవేంటో వివరంగా తెలుసుకుందాం…

ప్రతి ఏడాది ఆగస్టు మొదటి శుక్రవారాన్ని ‘అంతర్జాతీయ బీర్ దినోత్సవం’గా నిర్వహిస్తున్నారు. కాబట్టి.. ఈ రోజు (ఆగస్టు 5) మనం మధుప్రియులకు బీర్ డే శుభాకాంక్షలు చెప్పాల్సిందే. 2007లో కాలిఫోర్నియాలోని శాంటా క్రజ్లో జెస్సీ అవ్షలోమోవ్ ‘బీర్ డే’కు శ్రీకారం చుట్టారు..మద్యం తాగడానికి మందుబాబుల దగ్గర అనేక రీజన్స్ ఉంటాయి. చిన్న కారణాన్ని కూడా మందుతో సెలబ్రేట్ చేసుకోడానికి ప్రయత్నిస్తారు. ఈ బీర్ డే కూడా అలాంటిదే.

స్నేహితులంతా కలిసి బీరు రుచిని ఆస్వాదించడం కోసమే ఈ డే. అంతేకాదు, ఈ బీరును సర్వ్ చేసే వ్యక్తులతో కూడా ఈ రోజు తమ ఆనందాన్ని పంచుకుంటారు. ‘బీర్’ బ్యానర్ కింద ప్రపంచ బీరు ప్రియులందరినీ ఒక్కటి చేయడం ఈ రోజు ప్రత్యేకత. 2007లో మొదటిసారి ఈ Beer Day జరిగింది. 2012లో ప్రపంచవ్యాప్తంగా పోల్ నిర్వహించి ప్రతి ఆగస్టు మొదటి శుక్రవారం బీర్ డేను సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు.. ఏదైనా మితంగా తీసుకుంటే అమృతం అనే సంగతి తెలిసిందే..

బీర్ను బార్లీ లేదా గోధుమ గింజలు, కొన్ని రకాల మసాలాలు, ఈస్ట్, నీళ్లు కలిపి తయారుచేస్తారు. అయిదు దశల్లో బీరును సిద్ధం చేస్తారు. మొదట బార్లీ, లేదా గోధుమలను మొలకెత్తిస్తారు. తరువాత మాషింగ్ పద్ధతిలో వాటిని లిక్విడ్గా మారుస్తారు. ఆ ద్రవాన్ని బాగా మరగబెట్టి ప్రత్యేక మసాలాలు కలుపుతారు. నిల్వ ఉంచేందుకు ఫెర్మెంటేషన్ పద్ధతిలో ఈస్ట్ అనే బ్యాక్టిరియాను అందులో మిక్స్ చేస్తారు. అందుకే బీర్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది..అందుకే రుచిలో కూడా మార్పు ఉండదు..

బీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చుద్దాము..

*. బీరుకు క్యాన్సర్ను అడ్డుకోగలిగే శక్తి కూడా ఉందట. అది పెద్దపేగు, కాలేయ క్యాన్సర్ కణాలను అడ్డుకుంటుందట.
*. బీరు కాలేయానికి మంచిది కాదని చెబుతారు. అయితే, బీరును మితంగా తాగేవారికి మాత్రం మంచిదేనట. బీరులో ఉండే క్సాంతోహోమోల్ కాలేయానికి మేలు చేస్తుందట.
*. బీరు గుండెకు కూడా మేలు చేస్తుందట. వారానికి ఒక సారి ఆరు పింట్ల కంటే తక్కువగా, మీడియం స్ట్రాంగ్ బీరు తాగితే హార్ట్ సమస్యలే ఉండవట.
*. బీరు మధుమేహులకు మంచిదేనట. బీరులో అధిక సంఖ్యలో ఉండే పాలీఫెనల్స్ శరీరంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుందట. ఆల్కహాల్ లేని బీర్ను మితంగా తీసుకుంటేనే ఈ ప్రయోజనం ఉంటుందని నిపుణులు అంటున్నారు…

ఇవే కాదు ఇంకేన్నొ ప్రయోజాలు ఉన్నాయి.. ఏది ఏమైనా.. కొద్దిగా తీసుకుంటే మంచిదనే సంగతి గుర్తుంచుకోవాలి..

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version