హన్సిక పెళ్లి డ్రస్ ఖరీదు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.!!

-

గోవా బ్యూటీ హన్సిక ఎట్టకేలకు డిసెంబర్ 4న వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అంగరంగ వైభవంగా ఈమె వివాహం జరిగిందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ పెళ్లికి సెలబ్రిటీలు ఎవరు రాలేదు . కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.. తాజాగా హన్సిక పెళ్లిలో వేసుకున్న డ్రెస్సుల ఖరీదు ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది. ఇకపోతే టాలీవుడ్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న హన్సిక మోత్వాని.. సోహైల్ ను వివాహం చేసుకుంది. ఆచార సంప్రదాయాలతో జరిగిన పెళ్లితో ఈ జంట వివాహ బంధంలోకి అడుగు పెట్టింది . ముఖ్యంగా జైపూర్ లోని ప్రముఖ ప్యాలెస్ లో వీరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పవచ్చు.

ముంబైకి చెందిన వ్యాపారవేత్త సోహైల్ ను ప్రేమించిన ఈమె ఆత్మీయుల సమక్షంలో వివాహం చేసుకుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియా ద్వారా నూతన వధూవరులు తమ వివాహానికి ముందు జరిగిన వేడుకలను అలాగే వివాహ సమయంలో జరిగిన వేడుకలను అన్నింటిని కూడా ఫోటోల రూపంలో మీడియాతో పంచుకున్నారు. ఇకపోతే హన్సిక మోత్వాన్ని సూఫీ రాత్రి కోసం అభినవ్ మిశ్రా సెట్ చేసిన గోల్డెన్ షరారను ధరించింది. ఈ గోల్డెన్ కలర్ లెహంగాలో చూసిన అభిమానులు పాత రోజులకు తీసుకెళ్లింది అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మిర్రర్ వర్క్ చేసిన షెరార సెట్ మరియు వెండి టిష్యూ ఆర్గాన్జాతో చేసిన దుపట్టాలో డ్రాప్ డెడ్ చాలా అందంగా ఉంది. ఇకపోతే దీని ఖరీదు అక్షరాల రూ.3లక్షలని సమాచారం.


ఇకపోతే పెళ్లి కోసం 20 కోట్ల రూపాయలను ఖర్చు చేసిన హన్సిక ఇప్పుడు తన వివాహ వేడుకకు ధరించిన రెడ్ కలర్ లెహంగా ధర కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది సుమారుగా రూ. 6 లక్షలకు పైగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఏది ఏమైనా ఇంత ఖరీదైన దుస్తుల్లో హన్సిక అంతకుమించిన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news