తుంబ సాగుతో రైతులు లక్షాధికారి అవ్వచ్చు.. తప్పక ఈ నియమాలను పాటించండి..!

-

సరైన పంటలను రైతులు వేస్తే తప్పకుండా మంచిగా లాభాలు వస్తాయి. అయితే తుంబ ఫార్మింగ్ వల్ల చాలా మంది రైతుల దశ తిరిగిపోతుంది. సాధారణంగా తక్కువ వర్షపాతం ఉన్న ఎడారి ప్రాంతాలలో పంటలు పండించడం కష్టం. కానీ కలుపు మొక్కగా పేరుగాంచిన తుంబ సాగు ఎక్కడైనా సరే బాగా పండుతుంది.

ఎడారిలో కూడా రైతులకు మంచి ఆదాయ వనరుగా మారింది. అయితే మరి ఈ తుంబ సాగుకి సంబంధించి ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. వీటిని అనుసరిస్తే రైతులు తప్పకుండా లక్షాధికారులు అయిపోవచ్చు. ఔషధ గుణాలు ఈ మొక్కలలో అధికంగా ఉంటాయి. అందుకనే దీనికి డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. తుంబ పొడిని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు. అయితే దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి.

పొట్టని శుభ్రపరచడానికి, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి బాగా పని చేస్తుంది. అలానే కామెర్లు మూత్ర సంబంధిత సమస్యలు కూడా ఉండవు. ఈ పండ్ల గుజ్జును ఎండబెట్టి ఔషధంగా ఉపయోగిస్తారు. 150 నుంచి 300 మిల్లీ మీటర్ల వర్షపాతం ఉండే చోట దిగుబడి బాగుంటుంది.

జూన్ జూలై సమయంలో ఎక్కువగా సాగు చేస్తే బాగుంటుంది. వీటి యొక్క విత్తనాలు మూడు మీటర్ల దూరంలో 1-1 మీటర్ల వరుసలలో మీటర్ల వరుసలో ఎకరానికి 250 గ్రాములు విత్తనాలు ఉంటే చాలు. నారు మార్పిడి చేస్తే సగానికి విత్తనాలు తగ్గిస్తారు.

దీని యొక్క పండ్లు నవంబర్-డిసెంబర్ లో పసుపు రంగులోకి మారుతాయి. ఒక ఎకరంలో రెండు క్వింటాళ్ల విత్తనాలు 3 నుంచి 3.5 క్వింటాళ్ల వరకు పంటలు పండుతాయి. ఇలా రైతులు దీనిని పండిస్తే లక్షల్లో లాభాలు పొందొచ్చు అలాగే కష్టాలు కూడా గట్టెక్కుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news