పటిక బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పటిక బెల్లం తీసుకుంటే రకరకాల సమస్యల నుండి బయటపడవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో పటిక బెల్లాన్ని తీసుకోవడం వలన చాలా సమస్యలు నుండి బయటపడడానికి అవుతుంది మరి ఇక వేసవిలో పటిక బెల్లం తీసుకుంటే ఎలాంటి లాభాలను పొందొచ్చు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. పటిక బెల్లం ని ఇండియన్ రాక్ షుగర్ అంటారు. ఎక్కువమంది పటిక బెల్లాన్ని ఇంట్లో వాడుతూ ఉంటారు చక్కెర చెరుకు రసంతో పోలిస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
షుగర్ కి బదులుగా పటిక బెల్లం ఉపయోగిస్తే జీవక్రియ కి మేలు కలుగుతుంది వాత పిత్త కఫ సమస్యలని దూరం చేసి ఈ మూడు దోషాలని సమతుల్యం చేయగలదు పటిక బెల్లం. పంచదారకు బదులు మీరు దీన్ని జ్యూస్ లో వేస్తె వెంటనే మీకు శక్తి లభిస్తుంది. జీర్ణ క్రియ వ్యవస్థని మెరుగుపరుస్తుంది కూడా. జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తిని ప్రోత్సహించి జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉండేటట్టు కూడా ఇది చేస్తుంది.
ఎముకలు దంతాలకి కూడా ఇది చాలా మేలు చేస్తుంది ఇందులో ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ఉంటాయి దాంతో శరీరానికి ప్లస్ అవుతుంది తప్ప ఇబ్బందులు ఉండవు. పటిక బెల్లం లో గ్లైసిరైన్ సమ్మేళనం ఉంది ఇందులో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి వేసవికాలంలో మనకి చాలా నీరసంగా ఉంటుంది ఎండ వలన తిండి తినాలని అనిపించదు. వెంటనే అలసిపోతూ ఉంటాం జ్యూస్ వంటి వాటిని మీరు తయారు చేసుకునేటప్పుడు పంచదారకి బదులుగా పటిక బెల్లం వేసుకుంటే తక్షణ శక్తిని పొందవచ్చు.