బత్తాయి ప్రకృతి ప్రసాదించిన మంచి ఆరోగ్యవంతమైన పండు. సంవత్సరంకాలం బత్తాయి, కమలాలు అందుబాటులో ఉంటాయి. రక్షణవ్వస్థకు ఈ రెండు దివ్యఔషధంలా పనిచేస్తాయి. బత్తాయి అంటే సీ విటమిన్ తింటే ఇమ్యునటీ పవర్ పెరుగుతుంది అని మాత్రమే తెలుసు. అసులు ఇందులో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, ఎన్ని పోషకాలు ఉన్నాయి అనేది ఈరోజు మనం విపులంగా చూద్దాం.
100 గ్రాములు బత్తాయి తీసుకుంటే 50 మిల్లీగ్రాములు విటిమిన్ సీ ఉంటుంది. విటమిని సీ మనకు ఏ విధమైన ఆరోగ్య సమస్యలు లేనప్పుడు 50మిల్లీ గ్రాములు ఒక రోజుకు సరిపోతుంది. శరీరంలో ఏదైనా గాయాలు, దెబ్బలు, ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు 100-200మిల్లీలు కావాలి. అలాంటి విటమిన్ సీ వేడిచేస్తే నశిస్తుంది. అందుకే బత్తుయిలు ఎవరూ వండుకుని తినరు..అసలు అలాంటి ఆలోచన కూడా రాదుకదా..మంచిగా జూస్ చేసి చేసుకుని తాగుతాం. బత్తాయి 100గ్రాములు తీసుకుంటే ఇందులో నీరు 88% ఉంటుంది. పిండిపదార్థాలు 9గ్రాములు ఉంటాయి.
కొవ్వులు ఉండవు. మాంసకృతులు కూడా లేనట్లే.0.1 అంటే లేనట్లే కదా. మెయిన్ గా శక్తిని ఇవ్వడానికి కార్బోహెడ్రేట్స్ ఉంటాయి. 100గ్రాములు బత్తాయి తీసుకుంటే తొక్కలు, గింజలు, పిప్పితీసేసి..కేవలం లోపల ముత్యాల్లగా ఉంటాయి కదా అది తీసుకుంటే 43కాలరీల శక్తి వస్తుంది. జూస్ చేసుకుని తాగినా ఇంతే ఉంటుంది. అనేక ఔషధ గుణాలు బత్తాయిలో ప్రత్యేకంగా ఉన్నాయి. సైంటిస్టులు బత్తాయిలో 7-8 స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయని కనుక్కున్నారు.2016లో ఇంటిగ్రల్ యూనివర్శిటి లక్నోవారు బత్తాయి మీద పరిశోధచేసి నిరూపించారు. అవేంటంటే..
1. బత్తాయిలో ఉండే ఫ్లెవనాయిడ్స్ ముఖ్యంగా డైజెస్టివ్ ఎంజైమ్స్ ని, పొట్టలో ఉత్పత్తయ్యే ఎంజైమ్స్ ని , లివర్ నుంచి ఉత్పత్తి చేసే బైల్ జ్యూస్ ను సరైన మోతాదులో విడుదలయ్యేట్లు ప్రేరణ కలిగిస్తుంది. అట్లాగే ఆహారపదార్థాలు అరిగించడానికి కదలికలు బాగా అవసరం, ఈ కదిలకలు పెంచి ప్రోపర్ గా డైజెషన్ అయ్యేట్లు చేయడానికి, జీర్ణక్రియ యాక్టీవ్ గా ఉండేట్లు చేయడానికి, ప్రేగుల్లో ఆహారపదార్థాలు పులవకుండా ఉండటానికి బాగా ఉపయోగపడతాయి.
2. ఇందులో విటిమిన్ సీ మరియు, యసిడిక్ నేచర్..సిట్రిక్ యాసిడ్ ఇందులో ఎక్కువగా ఉండటంతో..బత్తాయిలు నమిలినప్పుడు బ్యాడ్ బాక్టీరియా చచ్చిపోవడానికి, పళ్లను నాచురల్ గా క్లీన్ చేయడానికి, గారపట్టకుండా రక్షించడానికి, చిగుళ్లు దంతాలు బలంగా ఉండేలా బత్తాయిలు దోహదపడతాయి.
3. డీ లెమోనిన్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ బత్తాయిలో ఉంది. ఇది గాల్ బ్లాడర్ లో రాళ్లను కొంత శాతం వరకు చిన్నసైజులు ఉన్నప్పుడు కరిగించడానికి ఇది ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలింది. ఈరోజుల్లో ఈ సమస్య చాలామందికి ఉంది. లావు అవడంవల్ల ఏర్పడే కొవ్వు వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడుతున్నాయి కాబట్టి బత్తాయిని రెగ్యులర్ గా తింటే సమస్య పరిష్కారం అవుతుంది.
4. ఇందులో స్పెషల్ గా సాపోనిన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇవి యాంటిఫంగల్, యాంటివైరల్, యాంటిబ్యాక్టీరియల్ ప్రోపర్టీస్ ని బత్తాయి బాగా కలిగిఉంటుంది. వర్షాకాలంలో వచ్చే అంటువ్యాధులనుంచి రక్షించడానికి ఈ సాపోనిన్స్ బాగా ఉపయోగపడతాయి.
5. ఇందులో నారింజిన్, హెస్పెరిడిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉండటంవల్ల రక్తంలో చెక్కర శాతాన్ని కొంత తగ్గించడానికి, అలాగే బ్లడ్ లో ఉండే బ్యాడ్ కొలస్ట్రాల్ ఎల్డీఎల్ ను తగ్గించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
6.ఇందులో హైడోసెస్ విటిమిన్ సీ వల్ల జలుబు, శ్లేష్మాలు, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చాలా మంచి అవకాశం ఉంది అని సైంటిఫిక్ గా నిరూపించబడింది.
7. ఇందులో ఉండే బయోఫ్లేవనాయిడ్స్ మెయిన్ గా చర్మానికి ముడతలు రాకుండా కాపలాకాస్తుంది . స్కిన్ హెల్తీగా ఉండాలంటే..శరీరానికి విటమిన్ సీ ఎక్కువగా కావాలి. అందుకే కెమికల్ పొల్యూట్ నుంచి రక్షించుకోవడానికి, చర్మఆరోగ్యానికి ఇందులో ఉండే బయోఫ్లేవనాయిడ్స్ ముఖ్య కారణం. చర్మం లోపల పొరలో ఉండే..కొలాజిన్ ఎలాస్టిన్ మెష్ ఎప్పుడు హెల్తీగా ఉండాలి. ఈ మెష్ తెగిపోతే.. ముడతలు వస్తాయి, స్టెష్ మార్స్ వస్తాయి. ఆ మెష్ కి విటమిన్ సీ చాలా అవసరం. ఈ బత్తాయి తీసుకోవడం వల్ల ఈ మెష్ ఆరోగ్యంగా ఉంటుంది. త్వరగా ముడతలు రావు, స్టెష్ మార్క్ కూడా రావు..కొందరికి వెయిట్ పెరిగినా, ఉన్నట్లు ఉండి తగ్గినా..ఆ ప్రదేశంలో స్టెచ్ మార్క్ వస్తాయి. ముఖ్యంగా తొడలు,పొట్టమీద ఇవి ఎక్కువగా ఉంటాయి. విటిమిన్ సీ లోపిస్తే స్టెచ్ మార్క్ ఎక్కువగా వస్తాయని సెంటిఫిక్ గా తేలింది.
ఇన్ని లాభాలు బత్తాయిల వాడుకోవడంలో ఉన్నాయని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తేలింది.
అయితే కొంతమంది బత్తాయిని వలుచుకుని తింటారు, మరికొంతమంది జూస్ చేసుకుని తాగుతారు. ఈ జూస్ చేసుకోవడంలో కాస్త ఐస్, ఘగర్ కూడా వేస్తాం. అసలు బత్తాయిలను ఎలా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటుంది.
బత్తాయిలను ఎలా తీసుకోవడం మంచిది..?
బత్తాయిలను అసలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. బయటే ఉంచుకోవాలి. తొక్క గట్టిగా ఉంటుంది కాబట్టి రోజురోజుకి గాలి, సూర్యకిరణాలు తీసుకుని నిదానంగా పులుపు తగ్గి తియ్యగా తయారవుతుంది. బత్తాయికూడా తీసుకొచ్చిన నాలుగురోజులకు మగ్గిపోతుంది. అప్పుడు రసం పెరుగుతుంది. ఆ పచ్చితగ్గుతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే ఇలాంటి మార్పులు రావు. కాబట్టి బయటే ఉంచుకోవాలి.
బత్తాయి రసం తీసినప్పుడు అది పుల్లగా ఉంటే ..అప్పుడు కొంచె నీళ్లు కలుపుతాగవచ్చు. కానీ..పంచదార మాత్రం అసలు వేయకూడదు. పంచదార వేయటం వల్ల జలుబు, దగ్గు వస్తుంది. శ్లేష్మాలు పట్టేస్తాయి. పంచదారకు బదులు తేనె వేసుకోవచ్చు. నీళ్లు కూడా కొంచెంమాత్రమే కలపాలి.
బత్తాయిరసం తీశాక గంటా గంటన్నర లోపే వాడేసుకోవాలి. ఎక్కువసేపు నిల్వఉంటే..ఆక్సిజన్ తో రియాక్షన్ జరిగి చెడిపోతాయి. ఫ్రష్ గా తాగడానికే ప్రయత్నించాలి.
బయట మార్కెట్ లో పచ్చిబత్తాయిలను కోసేసి..అవి పండించడానికి కార్బెడ్ వేసి అవి మగ్గినట్లుగా మార్చేసి అమ్మేస్తారు. అలాంటివి పూర్తిగా తయారవడం లేదు కాబట్టి అందులో ఉన్న రసాయన పదార్థాలు వల్ల ఎలర్జీలు వస్తాయి. అవి మనం తెలియక తెచ్చుకుని జ్యూస్ చేసుకుని తాగటం వల్ల జలుబు, దగ్గు వస్తాయి. కాబట్టి బత్తాయిలు బాగా పండినప్పుడే తినాలి.
ఇన్ని ఉపయోగాలు ఉన్న బత్తాయిను ఇక ఈజీగా తీసుకోకండి. పండ్లు చీప్ గా వస్తాయని చాలామంది వీటిని తినడానికి పెద్దగా ఆసక్తిచూపరు. ఇక బత్తాయిను తినటం ప్రారంభించండి..అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం చేసుకోండి.
-Triveni Buskarowthu