నార్సింగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఐ పై దాడికి ప్రయత్నించారు నిందితుడు కరణ్ సింగ్ బంధువులు. మమ్మల్ని విచారణకు ఎలా పిలుస్తారు అంటూ స్టేషన్ ముందే హంగామా చేశారు సిక్కు బస్తీ వాసులు. గురువారం జరిగిన కానిస్టేబుల్ పై దాడి కేసులో పలువురు అనుమానితులను పోలీస్ స్టేషన్ కి విచారణ నిమ్మిత్తం పిలిపించారు పోలీసులు.
దీంతో మమ్మల్ని ఎలా విచారిస్తారు అంటూ సీఐపై దాడికి యత్నించారు నిందితుడు కరణ్ సింగ్ బంధువులు. గురువారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఔటర్ సర్వీస్ రోడ్డు మైసమ్మ దేవాలయం సమీపంలో బైక్ పై వెళుతున్న వారిపై కొందరు దుండగులు కత్తులతో దాడికి దిగారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా తులసి కి తీవ్రగాయాలు అయ్యాయి. వారి నుండి తప్పించుకున్న తులసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం రాజు, విజయ్ అనే కానిస్టేబుల్ లను జగద్గిరిగుట్టలోని సిక్కుల బస్తీకి పంపారు. ఈ క్రమంలో అక్కడ కానిస్టేబుల్ పై సర్దార్ కరణ్ సింగ్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గాయపడ్డ రాజు పరిస్థితి విషమంగా ఉండడంతో మరొక కానిస్టేబుల్ విజయ్ తలపై గాయాలయ్యాయి. ఈ ఘటన నిమిత్తం పలువురిని పోలీసులు స్టేషన్ కి తీసుకువచ్చి విచారణ చేపడుతుండగా పై ఘటన చోటు చేసుకుంది.