శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. విటమిన్ బి ఉండే ఈ ఆహార పదార్థాలను తీసుకోవాల్సిందే..!

-

పూర్తి ఆరోగ్యం బాగుండాలంటే శరీరానికి ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. దానికి సంబంధించి ఎంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని కచ్చితంగా తీసుకోవాలి. ఎప్పుడైతే జీవన విధానంలో మంచి ఆహారం, వ్యాయామం వంటివి ఉంటాయో ఎంతో ఆరోగ్యంగా మరియు ఆనందంగా జీవించవచ్చు. చాలా శాతం మంది ఎన్నో పోషక లోపాలతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా, విటమిన్ బి లేకపోవడం వలన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ ఆహార పదార్థాలను రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వలన విటమిన్ బి ను పుష్కలంగా పొందవచ్చు.

ఉడికించిన పప్పుదినుసులలో 90% వరకు విటమిన్ బి 9 ఉంటుంది. అంతేకాకుండా, పప్పులను తినడం వలన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు. దీంతో బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు. పుట్టగొడుగుల ద్వారా కూడా విటమిన్ బి ను ఎక్కువగా పొందవచ్చు. ముఖ్యంగా విటమిన్ బి 2, బి 5 లతో పాటు బయోటిన్ ను కూడా శరీరానికి అందించవచ్చు. పుట్టగొడుగులను తినడం వలన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. దీంతో, పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెరుగులో కాల్షియం తో పాటుగా విటమిన్ బి 2, బి 12, వంటి ఎన్నో మంచి గుణాలు ఉంటాయి.

సహజంగా పండ్లను తీసుకోవడానికి అందరూ ఇష్టపడరు. అయితే, పండ్ల ద్వారా కూడా ఎన్నో మంచి గుణాలను శరీరానికి అందించవచ్చు. కివి పండ్లను తీసుకోవడం వలన విటమిన్ బి తో పాటు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషక విలువలను శరీరానికి అందించవచ్చు. వీటిని తీసుకోవడం వలన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ విధంగా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆపిల్ పండ్లలో విటమిన్ బి 13 పుష్కలంగా ఉంటుంది. పైగా దీనిలో క్యాలరీలు కూడా ఎంతో తక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఆపిల్ పండ్లను తీసుకొని పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news