ఇలా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మరెంత పెంచుకోండి..!

-

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. అలానే ప్రతీ చిన్న విషయంపై కూడా శ్రద్ధ పెట్టాలి. అయితే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఊపిరితిత్తుల ఆరోగ్యానికి ఎలాంటి ఆహార పదార్థాలు మేలు చేస్తాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మరి ఆలస్యమెందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం.

lungs | ఊపిరితిత్తులు

బెర్రీస్:

స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్ వంటివాటిలో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి.

సాల్ట్:

సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆస్తమా సమస్య కూడా వస్తుంది అలానే ప్రాసెస్డ్ ఫుడ్ అసలు తీసుకోవద్దు. దీని వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి.

ఆకుకూరలు:

ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. పాలకూర, మెంతికూర, తోటకూర వంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. ఇవి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

కాఫీ:

కాఫీ లో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు ఉంటాయి అలానే పాలీఫెనాల్స్ కూడా ఉంటాయి ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలా ఈ ఆహారపదార్థాలతో ఊపిరితిత్తులని ఆరోగ్యంగా ఉంచుకోండి. అలాగే ఆరోగ్యంగా జీవించండి.

Read more RELATED
Recommended to you

Latest news