టీమిండియా సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. మూడో రోజు టీమిండియా 198 పరుగుల వద్దే ఆలౌట్ అయింది. దీంతో ప్రత్యర్థి సౌత్ ఆఫ్రికా విజయానికి 211 పరుగులు అవసరం కానున్నాయి. అయితే మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 223 పరుగులు చేసింది. అలాగే సౌత్ ఆఫ్రికా 210 పరుగలకే ఆలౌట్ అయింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో భారత్ 198 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో సౌత్ ఆఫ్రికా విజయలక్ష్యం 211 పరుగులు.
కాగ రెండో ఇన్నింగ్స్ లో భారత్ బ్యాట్స్ మెన్లు దారుణంగా విఫలం అయ్యారు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక్కరే 100 (నాటౌట్) రాణించాడు. మిగతా బ్యాట్స్ మెన్లు అందరూ చేతులెత్తేసారు. మొత్తం స్కోరులో రిషబ్ పంత్ ఒక్కరే సగ భాగం పరుగుల సాధించాడు. అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లి 29 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే ఓపెనక్ కెఎల్ రాహుల్ కూడా 10 పరుగలకే పరిమితం అయ్యాడు. ఇక మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. సీనియర్ బ్యాట్స్ మెన్లు పుజారా (9), రహానే (1) మరో సారి విఫలం అయ్యారు.