ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 13,154 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 82, 402 కు చేరింది.
ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.38 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 268 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,80,860 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7486 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,42,58,778 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,43,83,22,742 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 63,91,282 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.
India reports 13,154 new COVID19 cases in the last 24 hours; Omicron case tally rises to 961 with 263 cases in Delhi and 252 in Maharashtra pic.twitter.com/LEea2AP2UO
— ANI (@ANI) December 30, 2021