మొబైల్ ఫోన్ వినియోగదారులు ఒక నెట్వర్క్ నుండి మరొక నెట్వర్క్ కు మారాలంటే సిమ్ కార్డు పోర్టబులిటీ చేసుకోవాలి. అయితే అలా పోర్టింగ్ కోసం ఎస్ఎంఎస్ చేయాలంటే కనీసం మొబైల్ ఫోన్ లో ఒక రూపాయి బ్యాలెన్స్ అయినా ఉండాలి. అయితే తాజాగా అలాంటి నిబంధనలు లేకుండా సిమ్ కార్డు పోర్టబులిటీ చేసుకోవాలని అనుకున్నవారికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ ఊరట కలిగించే వార్తను వినిపించింది.
ఇదివరకు సిమ్ కార్డు నెట్వర్క్ మారాలనుకుంటే బ్యాలెన్స్ లేని సమయంలో అప్పుడు మళ్లీ బ్యాలెన్స్ వేసుకోవాల్సి వచ్చేది. అలా పోర్ట్ అయ్యిన తర్వాత వినియోగదారుడి బ్యాలెన్స్ వృధా అయ్యేది. కానీ సిమ్ కార్డు పోర్టింగ్ సమయంలో ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండాలనే నిబంధనలు ఎత్తివేయాలని టెలికాం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఇకపై పోర్ట్ అవ్వాలనుకునే వారు ఎస్ఎంఎస్ పంపేందుకు బ్యాలెన్స్ ను ఉంచుకోవాల్సిన అవసరం లేదు.