ఇండియాపై చమురు భారం… గతేడాదితో పోలిస్తే రెట్టింపైన దిగుమతులు

-

ప్రపంచంలో అత్యధికంగా క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా అతి ముఖ్యమైనది. ఏటికేడు ఇండియాలో చమురు వినియోగం పెరుగుతోంది. దీంతో దేశంలోని విదేశీ మారకనిల్వల్లో ఎక్కువగా చమురుకే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత దేశంపై ఆర్థిక భారం పడుతోంది. మరోవైపు ముడి చమురు ధరలు పెరగడంతో ఈ భారం మరింతగా పెరుగుతోంది… ఇండియాకు ఆర్థిక కష్టాలు తెచ్చిపెడుతోంది. 

తాజాగా చమురు మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం… గత ఆర్థిక సంవత్సరం చమురు బిల్లులు 9 లక్షల కోట్లకు చేరుకుందని తెలిపింది. 2020-21లో చమురు దిగుమతి బిల్లు 4.70 లక్షల కోట్లు ఉంటే… 2021-22లో ఇది రెట్టింపైందని వెల్లడించింది. భారత్ తన చమురు అవసరాల్లో 85.5శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉంది. 2021-22లో మొత్తం 212.2 మిలియన్ టన్నుల ముడి చమురు భారత్ దిగుమతి చేసుకుంది.

మరోొవైపు ప్రతీ రోజు పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. దీంతో ప్రభుత్వాలు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. రాయితీలను అందిస్తున్నాయి. మరో వైపు హైడ్రోజన్ వాహనాలను తయారీని కూడా భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news