రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేక స్కీమ్… ఈ అకౌంట్ తో బంపర్ రిటర్న్స్ ..!

-

ఈ మధ్య కాలం లో చాలా మంది తమకి నచ్చిన చోట ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు కూడా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నారా..? అయితే తప్పకుండ ఇది చూడాలి. ఎలాంటి రిస్క్ కూడా దీని వలన ఉండదు. మీకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఆప్షన్ అందిస్తోంది. ఇందులో చేరితే బంపర్ రిటర్న్‌తో పాటు భద్రత కూడా లభిస్తుంది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. రిజర్వు బ్యాంక్ ఆర్‌బీఐ రిటైల్ డైరెక్ట్ స్కీమ్ కింద ఇన్వెస్టర్లు గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో డబ్బులు పెట్టొచ్చు. అకౌంట్ ఓపెనింగ్, మెనేజ్‌మెంట్‌కు చార్జీలు చెల్లించక్కర్లేదు. అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. ఆన్‌లైన్‌లోనే ఖాతా తెరవొచ్చు.

గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ను రిటైల్ ఇన్వెస్టర్లకు కూడా అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ఈ స్కీమ్ ని తీసుకు రావడం జరిగింది. ఆన్ లైన్ సేవలను కూడా తీసుకొచ్చారు. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ఏదైనా ఓపెన్ చేయొచ్చు. అయితే అందరు దీనిని ఓపెన్ చెయ్యడం అవ్వదు.

ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందాలి అంటే బ్యాంక్ సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి. పాన్ నెంబర్, ఇతర కేవైసీ డాక్యుమెంట్లు కూడా అవసరం. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వంటివి తప్పనిసరి. అప్పుడే ఈ రిటైల్ డైరెక్ట్ ప్లాన్‌లో రిజిస్టర్ చేసుకోవడం కి కుదురుతుంది.

దీని కోసం మీరు ఆర్‌బీఐ వెబ్‌సైట్‌కు వెళ్లి ఈ అకౌంట్‌ను తెరవొచ్చు.
తర్వాత సెక్యూరిటీస్ ట్రేడింగ్ చేయొచ్చు.
https://rbiretaildirect.org.in/ వెబ్‌సైట్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో అకౌంట్ ఓపెన్ చెయ్యచ్చు.
పేరు, పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్, బ్యాంక్ అకౌంట్ వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
మీకు వచ్చే ఓటీపీ ని ఎంటర్ చేయాలి.
నెక్స్ట్ మీకు ఓ ట్రాకింగ్ నెంబర్ వస్తుంది.
తర్వాత ఇన్వెస్టర్ కేవైసీ వివరాల వెరిఫికేషన్ ఉంటుంది. అలానే బ్యాంక్ అకౌంట్‌ను కూడా వెరిఫై చేసుకోవాలి.
అంతే అకౌంట్ అవుతుంది.
ఈమెయిల్ ఐడీకి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
అకౌంట్ నెంబర్, లాగిన్ ఐడీ వంటివి లభిస్తాయి. వీటి ద్వారా లాగిన్ అవ్వాలి.
మెచ్యూరిటీ డబ్బులు, వడ్డీ డబ్బులు ఆర్‌డీజీ అకౌంట్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ లో పడతాయి.

Read more RELATED
Recommended to you

Latest news