టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌.. ఒకే గ్రూపులో భారత్‌, పాక్‌

ఐసీసీ తాజాగా టీ 20 వరల్డ్‌ కప్‌ గ్రూపులను ప్రకటించేసింది. ఐసీసీ ప్రకటించిన గ్రూప్‌ ల ప్రకారం చిరకాల ప్రత్యర్థులు ఇండియా మరియు పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో 2019 వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత మరోసారి ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్‌ చూపే అవకాశం అభిమానులకు దక్కనుంది. అయితే.. టీ 20 వరల్డ్‌ కప్‌లో టీం ఇండియా జట్టుకు అసలు ముప్పు మాత్రం న్యూజిలాండ్‌ తోనే ఉంది.

ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌ పై టీం ఇండియా జట్టు విజయం సాధించి… 15 ఏళ్లు దాటిపోయింది. 2003 వన్డే.. వరల్డ్‌ కప్‌ లో చివరి సారిగా న్యూజిలాండ్‌ జట్లుపై విజయం సాధించిన టీం ఇండియా… 2007 టీ 20 వరల్డ్‌ కప్, 2016 టీ 20 వరల్డ్‌ కప్‌, 2019 వన్డే వరల్డ్‌ కప్‌ సెమీస్‌ లో మాత్రం ఘోర పరాజయం పాలైంది. అయితే.. అనూహ్యంగా ఈసారి టీ 20 వరల్డ్‌ కప్‌ 2021 సీజన్‌ లోనూ అసలు సమస్య న్యూజిలాండ్‌ జట్టు తోనే ఎదురు కానుంది. ఇక గ్రూప్‌ 2 లో టీం ఇండియా, పాక్‌, న్యూజిలాండ్‌ లతో పాటు మరో రెండు జట్లు చోటు దక్కించుకోనున్నాయి. ఈ లెక్కన న్యూజిలాండ్‌ తో ఇండియాకు జరిగే మ్యాచ్‌ లన్ని కీలకం కానున్నాయి.