అంతర్జాతీయంగా భారత దేశం పవర్ రోజు రోజు విస్తరిస్తుంది. భారత్ అగ్ర రాజ్యాల సరసన కూడా చేరుతుంది. ఆర్థికంతో పాటు ఇతర విభాగాల్లో కూడా భారత్ శక్తి వంతంగా మారుతుంది. ఇప్పటికు పలు మార్లు నిరుపితం అయింది. తాజా గా మరో సారి ఉదహారణగా ఘటన జరిగింది. ఉక్రెయిన్ దేశం పై రష్యా యుద్ధం ప్రారంభించి ఆరు రోజులు అవుతున్నా.. రష్యా ఒక్క సారి కూడా యుద్ధం ఆపలేదు. ప్రపంచ దేశాలు యుద్ధం ఆపడానికి అనేక ప్రయత్నాలు చేసినా.. అన్నీ కూడా విఫలం అయ్యాయి.
కానీ భారత్ పవర్ చూపించింది. ఉక్రెయిన్ లోని ఖార్కివ్ లో చిక్కుకున్న భారతీయుల కోసం ప్రధాని మోడి.. పుతిన్ కు ఫోన్ చేశారు. ఖార్కివ్ లో ఉన్న భారతీయులను తరలించడానికి సాయం చేయాలని కోరారు. దీనికి పుతిన్ సానుకూలంగా స్పందించారు. అంతే కాకుండా ఖార్కివ్ లో దాదాపు 6 గంటల పాటు యుద్ధం ఆపాలని అక్కడ ఉన్న బలగాలకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
ఖార్కివ్ లో ఉన్న భారతీయులు అందరూ 6 గంటల్లో ఖాళీ చేయాలని సూచించారు. కాగ ప్రపంచ దేశాలు యుద్ధంపై ఎన్ని ప్రకటనలు చేసినా.. రష్యా తగ్గలేదు. కానీ భారత్ ఒక్క ఫోన్ కాల్ తో యుద్ధాన్ని ఆపించింది.