తొలి వన్డేలో ఇంగ్లాండ్ ను టీమిండియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో బుమ్రా దెబ్బకు ఇంగ్లాండ్ జట్టు 110 పరుగులకే ఆల్ అవుట్ కాగా… తర్వాత చేదనకు దిగిన టీమిండియా లక్షాన్ని 18.4 ఓవర్లలోనే చేదించింది. తద్వారా ఇంగ్లాండ్ గడ్డ మీద… ఇంగ్లాండ్ వన్డే చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఓడించింది ఇండియా.
ఇప్పుడు వరకు వన్డేల్లో ఇంగ్లాండ్ స్వదేశంలో ఎప్పుడూ కూడా 10 వికెట్ల తేడాతో ఓడిపోలేదు. కానీ నిన్నటి మ్యాచ్ లో టీమిండియా చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయి… అప్రదిష్ట మూటగట్టుకుంది. ఓపెనరర్లు రోహిత్ శర్మ 76 నాటౌట్, దావన్ 31 నాటౌట్ అజేయంగా నిలిచారు.
ఇన్నింగ్స్ ఆరంభం లో ఆచితూచి ఆడిన ఈ జోడీ తర్వాత దూకుడు పెంచి విజయం అందుకుంది. దీంతో మూడు వన్డేల సిరీస్ లో ఇండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అటు ఇండియాలో బౌలింగ్ విషయానికి వస్తే.. బుమ్రా ఒక్కడే 6 వికెట్లు పడగొట్టి.. ఇండియా గ్రాండ్ విక్టరీ అందించాడు.