బోటనీలో ఈ టాపిక్స్ ను ప్రిపేర్ అయితే చాలా మంచి స్కొర్ మీ సొంతం..

-

దేశ వ్యాప్తంగా నీట్ ఎగ్జామ్స్ జరగనున్న సంగతి తెలిసిందే..నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఆధ్వర్యంలో జులై 17న మెడికల్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ నిర్వహించనున్నారు.నీట్‌ 2022 పరీక్ష 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహిస్తారు. ఈ పరీక్ష కాల పరిమితి మూడు గంటల 20 నిమిషాలు. మొత్తం 200 ప్రశ్నలకు నీట్ పరీక్ష ఉంటుంది. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి సరైన ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానికి ఒక మార్కును కోసేస్తారు..
బోటనీలో మంచి స్కొరు చేయాలనుకుంటే మాత్రం ఇలా ప్రిపేర్ అవ్వాలి..

బోటనీ సబ్జెక్ట్‌లో మూడు రకాల ప్రశ్నలు విద్యార్థులకు వస్తుంటాయి. ఒకటి బొమ్మల ఆధారంగా.మరొకటి విశ్లేషాణాత్మకం, ఇంకొకటి జ్ఞాపకశక్తి ఆధారిత ప్రశ్నలు.జనెటిక్స్‌ అండ్‌ మాలిక్యులర్‌ బేసిస్‌ ఇన్‌హెరిటెన్స్‌ వంటి అధ్యాయాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు RNA, DNA నిర్మాణాలు, జన్యు సంకేతం, ప్రోటీన్ సంశ్లేషణ మొదలైన వాటిపై ప్రశ్నలు వస్తాయంటున్నారు.

మొక్క ఎదుగుదల దశలు , జీవ వర్గీకరణ మరియు మొక్కల రాజ్యం వంటి అధ్యాయాలు నుండి చాలా ప్రశ్నలు అడుగుతారు.అందుకే కొంచెం బ్రెయిన్ పెట్టి చదవాలి.నీట్ పరీక్ష కోసం ప్రిపరేషన్ పూర్తిగా NCERT పాఠ్యపుస్తకాల నుండి ఉండాలని సూచిస్తున్నారు. NCERT పాఠ్యపుస్తకాలపై దృష్టి పెటి చదవితే అధిక మార్కులు మరియు మంచి ర్యాంక్ సాధించవచ్చంటున్నారు. సమయం తక్కువగా ఉండటం వల్ల కేవలం విద్యార్థులకు తెలిసిన వాటిపైనే దృష్టి సారించాలని.తెలియని వాటిని ముట్టుకోవద్దంటున్నారు.చివరి నిమిషంలో తెలియని వాటికి దూరంగా ఉండటం బెస్ట్..

ఎక్కువ ఫోకస్ చెయాల్సిన అంశాలు..

ప్లాంట్ ఫిజియాలజీ. విభజన మరియు కణ జీవశాస్త్రం, జీవావరణ శాస్త్రం.

మొక్కల అనాటమీ, బయో అణువు,

మానవ సంక్షేమంలో జీవశాస్త్రం.

మొక్కల వైవిధ్యం.

మొక్కల పునరుత్పత్తి మరియు స్వరూపం.

ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ సిలబస్‌ నుంచి 40-42 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. మిగిలిన వాటిలో 48-50 ప్రశ్నల వరకు సెకండ్‌ ఇయర్‌ సిలబస్‌ నుంచి రావచ్చంటున్నారు మురళీ కృష్ణ. గతంలో జరిగిన ఎగ్జామ్‌ పేపర్లను ప్రాక్టీస్‌ చేస్తూనే.. ప్రతి రోజు ఒక షెడ్యూల్‌ వేసుకుని..పక్కా ప్రణాళికతో చదివితే మంచి స్కోరు సాధించవచ్చని ప్రముఖులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news