అఫ్గానిస్థాన్‌పై భారత్‌ ఘనవిజయం..

-

ఆఫ్ఘన్ విధించిన 273 పరుగుల విజయ లక్ష్యాన్ని 15 ఓవర్ల ముందే భారత్ చేదించింది. తొలుత లక్ష్య సాధన కోసం బరిలోకి దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచడానికి ప్రయత్నించారు. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక సెంచరీతో భారత్ విజయానికి బాటలు వేశాడు. రోహిత్ శర్మ కేవలం 84 బంతుల్లోనే 131 పరుగులు చేశాడు. ఆఫ్ఘన్ బౌలింగ్ దాడులను తుత్తునియలు చేసిన హిట్ మ్యాన్ ఏకంగా 16 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో పలు రికార్డులు కూడా రోహిత్ వశమయ్యాయి.

India vs Afghanistan Highlights, World Cup 2023: Rohit slams record World  Cup ton as India crush Afghanistan by 8 wickets - The Times of India

మరో ఎండ్ లో ఓపెనర్ ఇషాన్ కిషన్ 47 పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. సెంచరీ అనంతరం రోహిత్ శర్మ కూడా అవుటైనప్పటికీ, విరాట్ కోహ్లీ (55 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (25 నాటౌట్) మరో వికెట్ పడకుండా టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ తన స్థాయికి తగ్గట్టు 2 వికెట్లు తీశాడు.

ఇవాళ్టి మ్యాచ్ లో మరో ఆసక్తికర దృశ్యం కూడా కనిపించింది. ఐపీఎల్ సందర్భంగా తీవ్ర స్థాయిలో మాటలు విసురుకున్న ఆఫ్ఘన్ బౌలర్ నవీనుల్ హక్, టీమిండియా మాజీ సారథి కోహ్లీ హాయిగా నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న ఇరువురు గత వివాదానికి ముగింపు పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news