నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఇండిగో ఎయిర్ లైన్స్ పలు పోస్టులని భర్తీ చేస్తోంది. ట్రైనీ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. పూర్తి వివరాల లోకి వెళితే.. ఇండిగో రిక్రూట్‌మెంట్ కి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ goindigo.app.param.ai ను సందర్శించి అప్లై చేసుకోచ్చు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ లేదా ఏరోనాటికల్ విభాగం లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు మాత్రమే అప్లై చేసుకోవాలని ఇండిగో అంది.
ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. ఎవరు అర్హులు అనేది చూస్తే.. ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్స్/మెకానికల్/ ఏరోనాటికల్ విభాగాల్లో బీఈ/ బీటెక్ పూర్తి చేసి ఉండాలి. పదోతరగతి, ఇంటర్మీడియట్, బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోచ్చు. ఎయిర్‌క్రాఫ్ట్ రూటింగ్, ఫ్లీట్ మేనేజ్‌మెంట్, ఎయిర్‌క్రాఫ్ట్ గ్రౌండింగ్ సమయంలో మెయింటెనెన్స్ వంటి బాధ్యతలని ఎంపికైన వాళ్ళు తీసుకోవాలి.
వేర్‌హౌస్, ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, ఫ్రంట్ లైన్ సపోర్ట్ విధులు, విమాన భాగాల మరమ్మతుతో పాటు బాధ్యతలు తీసుకోవాలి. అదే విధంగా మెటీరియల్స్, స్పేర్స్, టూల్స్, ఎక్విప్‌మెంట్ ప్లాన్ అండ్ ప్రొవిజనింగ్‌తో పాటు విడిభాగాల సేకరణ, లాజిస్టిక్స్ సపోర్ట్ లాంటివి చెయ్యాల్సి ఉంటుంది. ఎయిర్‌క్రాఫ్ట్ లీజింగ్, సి-చెక్ తో సహా దీర్ఘకాలిక ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ లాంటివి కూడా చెయ్యాలి.
ఎంట్రన్స్ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్రభుత్వోద్యోగం మీ లక్ష్యమా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్, వింతలు విశేషాలు, ప్రేరణాత్మక కథనాల కోసం మనలోకం.కామ్ ని ఫాలో అవ్వండి.