కామారెడ్డి జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… శ్రీమంతుడు సినిమా స్ఫూర్తి తో నిర్మించిన బీబీపీట పాఠశాలను కళాశాల గా ఏర్పాటు చేస్తామని… మా నాయనమ్మ ఊరూ పోసానిపల్లి లో కూడా ప్రాథమిక పాఠశాలను నిరిస్తానని తెలిపారు.
శ్రీమంతుడు సినిమా తో ఇలాంటి కార్యక్రమం జరగడం చాల గొప్ప విషయమని… జూనియర్ కాలేజీ ప్రారంభోత్సవానికి మహేష్ బాబును తీసుకొస్తామన్నారు. దాని వల్ల మరింత మంది స్ఫూర్తి పొందుతారని… సుభాష్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాలను దత్తత తీసుకోవాలని తెలిపారు. 6 కోట్ల తో ఇలాంటి పాఠశాల ను నిర్మించడం చాల గొప్ప విషయమని.. తెలంగాణ రాష్ట్రం లోనే అత్యాధునిక సదుపాయాలతో ఈ పాఠశాల నిర్మించారని వెల్లడించారు. సీఎం కెసిఆర్ నాయకత్వం లో విధ్యుత్ కోతలు లేకుండా, సాగు నీరు , త్రాగు నీరు విషయం లో రికార్డు సృష్టించామన్నారు. తెలంగాణ లో మిషన్ మోడ్ లో అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించారు.