విజయదశమి పండుగ నేపథ్యంలో బెజవాడ ఇంద్రకీలాద్రి కి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా భవానీ భక్తులు ఇంద్రకీలాద్రి కి చేరుకున్నారు. భక్తులు భారీగా తరలి వస్తున్న నేపథ్యంలో క్యూలైన్లు రద్దీగా మారాయి. భవానీ భక్తుల దృశ్య… ఇంద్రకీలాద్రి ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. భవానీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో… విఐపి దర్శనాలను ఇవాళ మరియు రేపు రద్దు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది ఆలయ కమిటీ.
అంతే కాదు సాధారణ భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు కనకదుర్గమ్మ రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొండపైకి వాహనాలకు అనుమతి ని… నిరాకరిస్తున్నారు అధికారులు. దీంతో… ఆలయ ప్రాంగణంలో భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. కాగా రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ ఇంద్రకీలాద్రి ని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.