భద్రాచలం వద్ద తగ్గుతున్న గోదావరి నీటి మట్టం

-

భద్రాచలం వద్ద ఉధృతంగా పెరిగి 54 అడుగులు దాటి ప్రవహించిన నీటిమట్టం స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ప్రస్తుతం అక్కడ నీటిమట్టం 53.3 అడుగుల వద్ద ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. గతంలో కంటే నీటిమట్టం పెరగడంతో భద్రాచలం చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రహదారులపైకి వరద నీరు చేరడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వారంరోజులుగా ముంపు మండలాలు జలదిగ్బంధంలోనే చిక్కుకొనే ఉన్నాయి. కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోవడంతో నిత్యవసరాలు లభించక సుమారు 200 పైగా గ్రామాలప్రజలు ఇబ్బందిపడుతున్నారు. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.

మరోవైపు.. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కృష్ణా పరివాహక ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. జూరాల జూరాల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 2.35 లక్షల క్యూసెక్కులు ఉండగా 2.40 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.690గా ఉందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news