జీవితంలో అనుకున్నంత మాత్రాన మనం ప్రతిదీ సాధించలేము. జీవితంలో మనం సాధించాలంటే దానికి తగ్గ కృషి మనం చేయాలి. అలానే ఓటమి ఎదురవుతుందని భయపడకూడదు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే ప్రతి ఒక్కరూ కూడా వారి మీద వారు నమ్మకాన్ని పెంచుకోవాలి. అలానే నేను చేయగలను అనుకున్నది సాధించగలను అని పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండాలి.
అప్పుడు కచ్చితంగా లైఫ్ లో పైకి రాగలుగుతారు అంతేకానీ ఓటమి ఎదురవుతుందేమో నేను ఏం చేయలేను ఇటువంటివి అనుకోకూడదు. జీవితంలో ముందుకు వెళ్లాలని అనుకున్నా వెళ్ళలేకపోతున్నట్లయితే ఈ వ్యక్తిని ఆదర్శంగా తీసుకోండి. నిజానికి ఈయన సక్సెస్ స్టోరీ ని మీరు చూస్తే కచ్చితంగా చప్పట్లు కొడతారు. మరి ఇక సక్సెస్ స్టోరీ గురించి చూసేద్దాం.
రోమన్ సైని ఒక డాక్టర్. అలానే మాజీ ఐఏఎస్ కూడా. 16 సంవత్సరాల వయసులో ఎంతో కష్టమైన AIIMS పరీక్షలో పాస్ అయ్యారు తర్వాత 22 సంవత్సరాల వయసులో upsc సివిల్ సర్వీసెస్ పరీక్షలో పాసయ్యారు. సివిల్స్ లో విజయం సాధించి ఐఏఎస్ అయ్యారు. కానీ పదవికి రాజీనామా చేస్తే అనకాడమీ పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు ప్రస్తుతం 1500 కోట్లకు పైగా దీని విలువ ఉంది.
అనాకాడెమీ కో ఫౌండర్ రోమన్ సైనీ. వీరిది రాజస్థాన్. ఈయన MBBS చదివిన తర్వాత AIIMS యొక్క NDDTCలో జూనియర్ రెసిడెంట్‌గా పనిచేశాడు. అయితే పెదాలు ఎదుర్కొంటున్న సమస్యలని ఓ డాక్టర్ గా తీర్చలేకపోతున్నా అని కేవలం 6 నెలల్లోనే ఈ ఉద్యోగాన్ని వదిలేసి యూపీఎస్సీ పరీక్ష రాగా… 22 సంవత్సరాల వయస్సులో UPSC సివిల్ సర్వీసెస్ లో సక్సెస్ అయ్యి IAS అధికారి అయ్యాడు. 18వ ర్యాంక్ వచ్చింది. మధ్యప్రదేశ్‌లో కలెక్టర్‌గా పని చేసారు.