11 వేల రూపాయలతో మొదలు పెట్టారు.. ఇప్పుడు చూస్తే కోట్లలో టర్నోవర్..!

-

గట్టిగా అనుకుంటే ఎవరైనా సరే సాధించవచ్చు. నిజానికి ఒక ఐడియా చాలు జీవితాన్ని మారుస్తుంది. ఈమెని నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఈమె పేరు శిల్పి. ఈమెకి ఉదయం లేచిన తర్వాత పాలు తాగడం అలవాటు. ఒకరోజు ఆమె బెంగుళూరు లో ఉన్నప్పుడు పాలు అంత రుచిగా అనిపించలేదు. అయితే ఆమె ఎక్కువగా కల్తీ పాలనే చూస్తోంది స్వచ్ఛమైన పాలు బెంగళూరులో దొరకడం లేదు అని తెలుసుకుంది.

 

ఆమె స్వచ్ఛమైన పాల కోసం చూసింది. అయినప్పటికీ ఆమెకి స్వచ్ఛమైన పాలు దొరకలేదు. అప్పుడే ఆమె కల్తీ పాల గురించి తెలుసుకుని స్వచ్ఛమైన పాల వ్యాపారం చేయాలని అనుకుంది. ఆ తర్వాత పాడి రైతులను కలిసి ఆవులకి ఇవ్వాల్సిన ఆహారం గురించి మొదలైన వివరాల గురించి తెలుసుకుంది.

స్వచ్ఛమైన పాలను తనకి అమ్మాలని ఇతరులు కంటే ఎక్కువ ధర ఇస్తానని చెప్పింది రైతులకి. రైతులు కూడా ఆమెకి అంగీకరించి స్వచ్ఛమైన పాలను సప్లై చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు రైతుల వద్దకు ఆమె స్వయంగా వెళ్లి పాలను సేకరించి బెంగళూరులో అమ్మడం మొదలు పెట్టింది. అయితే పాలు మంచి నాణ్యత తో ఉండడం తో అందరూ కొనుగోలు చేయడం మొదలుపెట్టారు.

అయితే ఈమె సప్లై చేసే పాలకి కస్టమర్లు పెరుగుతుండడంతో రెండేళ్ల క్రితం సంస్థకు ది మిల్క్ ఇండియా అనే పేరు పెట్టింది. కర్ణాటక తమిళనాడు లోని 21 గ్రామాలలో రైతులు ఇప్పుడు పాలు విక్రయిస్తున్నారు. 11 వేల రూపాయలతో మొదలైన ఈ బిజినెస్ కోటి రూపాయల టర్నోవర్ సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news