కాంగ్రెస్ పోస్ట్ పోల్ అనాలసిస్… 5 రాష్ట్రాలకు నేతల నియామకం

-

ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత దయనీయంగా ఓటమి పాలైంది. ఓ జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా తన ఉనికిని గొప్పగా చాటుకోలేదు. 403 స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లో కేవలం రెండే సీట్లు గెలుచుకుంది. ఇక ఉత్తరాఖండ్ లో గెలిచే అవకాశాలు ఉన్నా చేజేతులా ఓడిపోయింది. ఇన్నింటి కన్నా పెద్ద విషయం పంజాబ్ లో ఓటమి. అప్పటి వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రేంజ్ లో ఓటమి పాలవుతుందని.. ఆ పార్టీ కూడా ఊహించలేకపోయింది. 117 స్థానాలకు గానూ 18 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. సీఎం అభ్యర్థి చరణ్ జీత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు. పీసీసీ ప్రెసిడెంట్ సిద్దూ కూడా ఓటమి పాలయ్యాడు. ఇక గోవా, మణిపూర్ లో పెద్దగా ప్రభావం చూపించలేదు. 

ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ పోస్ట్ పోల్ ఎనాలిసిస్ తో పాటు ఈ ఐదు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో మార్పుల కోసం ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ కొంత మంది నేతలను కేటాయించింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ కు జితేంద్ర సింగ్, ఉత్తరాఖండ్ కు అవినాష్ పాండే, గోవా కు రజినీ పాటిల్, మణిపూర్ జయ్ రామ్ రమేష్, పంజాబ్ కు అజయ్ మాకెన్ ను కేటాయించింది.

Read more RELATED
Recommended to you

Latest news