Yash: రూ.మూడొందలతో బెంగళూరొచ్చిన యశ్..KGF హీరో ఇన్‌స్పైరింగ్ స్టోరి

-

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన KGF చాప్టర్ 1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నెల 14న విడులైన చాప్టర్ 2 కూడా అంతకు మించిన విజయాన్ని ఇప్పటికే అందుకున్నది. రికార్డుల వేటలో ఆ పిక్చర్ ఇంకా ముందుకు సాగుతున్నది.ఈ చిత్రంలో నటించిన స్టార్ హీరో రాకింగ్ స్టార్ యశ్..పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.

దేశవ్యాప్తంగా యశ్ కు అభిమానులు ఏర్పడ్డారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది. అయితే, యశ్ కు ఈ స్టార్ డమ్ ఈ ఒక్క సినిమాతోనే వచ్చింది. కాగా, ఈయన వ్యక్తిగత జీవితం కూడా యువతకు స్ఫూర్తిదాయకం. ఆయన తన ఇన్‌స్పిరేషనల్ స్టోరిని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ స్టోరి మనం కూడా తెలుసుకుందాం.

ప్రస్తుతం స్టార్ హీరో గా యశ్ కు చక్కటి ఆదరణ ఉంది. కానీ, ఒకప్పుడు యశ్ నార్మల్ లైఫ్ గడిపాడు. హీరో అవుదామనుకుని ఇంటి దగ్గరి నుంచి రూ.300 తీసుకుని కర్నాటక రాజధాని బెంగళూరుకు వచ్చి కెరీర్ స్టార్ట్ చేశాడు. ఎన్నో స్ట్రగుల్స్ పడ్డాడు. సినీ అవకాశాల కోసం ఆఫీసులు చుట్టూత తిరగడం స్టార్ట్ చేశాడు.

సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన యశ్..సొంతూరు కర్నాటకలోని హసన్ జిల్లా కేంద్రం. కాగా, తండ్రి బస్ డ్రైవర్. తల్లి గృహిణి. యశ్ సినిమాల్లోకి వెళ్తానంటే ఆయన కుటుంబం ఒప్పుకోలేదు. కానీ, ఎట్టకేలకు తండ్రిని ఒప్పించి మూడొందలతో బెంగళూరొచ్చి అవకాశాల కోసం యశ్ ప్రయత్నించసాగాడు. తొలుత సీరియల్స్ లో నటించిన యశ్..2008లో ‘రాకీ’ చిత్రంతో హీరో అయ్యాడు. ఇప్పుడు ‘రాఖీభాయ్’గా బాక్సాఫీసును ఏలుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news