బాబు సూచ‌న‌లు సూటిగా చేస్తే.. పోయేది..!

-

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు క‌రోనా స‌మ‌యంలో జాతిని ఉద్దేశించి(రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను) త‌న హైద రాబాద్ ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో ఆయ‌న చేసిన కొన్ని వ్యాఖ్య‌లపై అధికార ప‌క్షం సీరియ‌స్ అయింది. మంత్రుల నుంచి స‌ల‌హాదారుల వ‌ర‌కు కూడా బాబుపై ఫైర‌య్యారు. మ‌రి ఇంత‌కీ బాబు ఏమ‌న్నారు? అనే విష‌యం చూస్తే.. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో లాక్‌డౌన్‌తో పేదలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు వారికి రూ.5 వేల నగదు, రెండునెలలకు సరిపడా రేషన్‌ ఇవ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

మన రాష్ట్రంలో కూడా కరోనా నిరోధక చర్యలు త్వరితగతిన చేపట్టాలని సూచించారు. విదేశాల నుంచి దాదాపు 15 వేల మంది రాష్ట్రానికి చేరినట్లు తెలుస్తోంద‌ని, వాళ్లందరికీ క్వారంటైన్‌ చేయాల‌ని,. పకడ్బం దీగా వారందరినీ విడిగా ఉంచాల‌ని సూచించారు బాబు.  ఇంట్లోనుంచి బయటకు రాకపోవడం వల్ల అటు ఉపాధి కోల్పోయి, ఇటు రోజువారీ ఆదాయం లేక రెండు విధాలా నష్టపోయారని, విపత్తులు సంభవించిన ప్పుడు బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడం ప్రభుత్వాల తక్షణ బాధ్యతని చెప్పారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి రెండు నెలలకు సరిపడా రేషన్‌ (బియ్యం, పప్పులు, వంటనూనె, చక్కెర, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు) ప్రతి ఇంటికీ డోర్‌ డెలివరీ చేయాల‌న్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్న‌ప్ప‌టికీ.. రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ట్టించుకోనేలేద‌ని, ప‌క్క రాష్ట్రాలు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంలో ముందున్నాయ‌ని చెప్పుకొచ్చారు. ఈ ప‌రిణామం అధికార ప‌క్షంలో ఆగ్ర‌హం తెప్పించింది. చంద్ర‌బాబువ్యాఖ్య‌ల‌పై మంత్రి క‌న్న‌బాబు మండిప‌డ్డారు. చంద్ర‌బాబులాగా త‌మ‌కు డ‌బ్బా కొట్టుకోవ‌డం రాద‌ని, మేం చేసేది ప్ర‌జ‌ల‌కు చేరితే చాల‌ని అనుకుంటామ‌ని, చంద్ర‌బాబులా గా ముందు మీడియాకు లీకులు ఇచ్చి.. త‌ర్వాత గోరంత‌ను కొండ‌త‌గా ప్ర‌చారం చేసుకోబోమ‌న్నారు.

అంతేకాదు, గ‌తంలో దోమ‌ల‌పై దండ‌యాత్ర చేసిన బాబు.. ఇప్పుడు అధికారంలో ఉండి ఉంటే.. క‌రోనాపై క‌త్తి యుద్ధం చేసేవారేమోన‌ని ఎద్దేవా చేశారు. మొత్తానికి చంద్ర‌బాబు సూచ‌న‌లు రాజ‌కీయ రంగు పులుము కోవ‌డంతో ప‌రిస్థితి ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు దారితీసింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news