కాబుల్​లో ఆత్మాహుతి దాడి.. 19 మంది మృతి

అఫ్గానిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుడు భారీ విధ్వంసం సృష్టించింది. రాజధాని కాబుల్​లోని షియా ప్రాంతంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 19 మంది మృతి చెందారు. మరో 27 మంది గాయాల పాలయ్యారు.

దాడి జరిగిన ప్రాంతమంతంలో షియా అనే అఫ్గాన్​ మైనారిటీ వారు అధికంగా నివసిస్తారని తాలిబాన్​ ప్రతినిధి ఖలీద్​ జర్దాన్​ తెలిపారు.. ఈ దాడులు తామే చేసినట్లు ఏ ఇస్లాం తీవ్రవాద సంస్థ ప్రకటించలేదని చెప్పారు.