నాలుగు కార్ల నిండా డబ్బు మూటగట్టుకుని పారిపోయిన ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు..

-

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. ఆఫ్ఘన్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించుకున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో ఉండలేమని చాలామంది ఆఫ్ఘన్ ప్రజలు దేశం దాటి రావాలని చూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని, నాలగు కార్ల నిండా డబ్బు మూటలు కట్టుకుని, అందులో సరిపోకపోతే హెలికాప్టర్ లో ఎక్కించుకుని పారిపోయినట్లు సమాచారం బయటకి వచ్చింది. ఈ మేరకు కాబూల్ లోని రష్యన్ రాయబార కార్యాలయం పేర్కొంది.

- Advertisement -

నాలుగు కార్లు డబ్బుతో నిండి ఉన్నాయి. అదీగాక కొంత డబ్బుని హెలికాప్తర్ లో నింపాలని చూసారు. అందులో కొంత డబ్బు రోడ్డు మీద పడి ఉందని, రష్యా రాయబార కార్యాలయ ప్రతినిధి నికితా ఇష్చెంకో వెల్లడించిందని, RIA న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి బిస్మిల్లా మహ్మదీ చేసిన ఒకానొక ట్వీటులో, మా చేతులను బంధించి మా మాతృభూమిని అమ్మారని, దీనికంతటికీ కారణం ఆ ధనవంతుడే అని అధ్యక్షుడిని ఉద్దేశిస్తూ పోస్ట్ చేసారు.

ఆఫ్ఘనిస్తాన్ సీనియర్ నాయకుడు అబ్దుల్లా మాట్లాడిన ఒకానొక వీడియో ప్రకారం, అష్రాఫ్ ఘని దేశం విడిచి వెళ్ళిపోయి ఉంటాడని వ్యాఖ్యానించారు. తాలిబన్ తిరుగుబాటు దారులు దేశాన్ని ఆక్రమించుకోవడానికి కారకులైన అధ్యక్షుడు ఘని, ఉపాధ్యక్షుడు.. ఇద్దరూ కలిసి దేశం విడిచి వెళ్ళిపోయి ఉంటారని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశం అయ్యాక అధ్యక్షుడు ఘని నుండి ఒక్క సందేశం కూడా బయటకు రాలేదు. మరో పక్క ఉపాధ్యక్షుడు కూడా స్పందించలేదు. అదే అంతకుముందు ఒకసారి మాట్లాడిన ఉపాధ్యక్షుడు, దేశాన్ని ఎవరి చేతుల్లోకి వెళ్ళనివ్వము అని కామెంట్లు చేసాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...