మద్యం కొంత తాగినా… ఎక్కువగా తాగిన ఆరోగ్యానికి చేసే హానీ మాత్రం ఎక్కువేనంటున్నారు నిపుణులు. తాజాగా ఆక్స్‌ఫర్డ్ పాపులేషన్ హెల్త్, పెకింగ్ యూనివర్సిటీ పరిశోధకులు సుదీర్ఘకాలం సుమారు 5 లక్షల మంది మద్యం బాధితులపై కీలక పరిశోధనలు చేసి విస్తుపోయే వాస్తవాలను వెల్లడించారు. మద్యం ప్రత్యక్షంగా 61 రోగాలకు, పరోక్షంగా 206 వ్యాధులకు కారణమవుతుందని తాజా పరిశోధన స్పష్టం చేసినట్లు తెలిపారు. కొంత తాగినా.. ఎక్కువ తాగినా శరీరంలోని అన్ని అవయవాలపై దుష్ప్రభావం పడుతుందని ఈ పరిశోధన తేల్చి చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా తాగుడు వల్ల ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారని, కోట్ల మంది అంగవైకల్యానికి గురవుతున్నారని తాజా అధ్యయనె ప్రకటించింది. ఈ తాజా అధ్యయనం నేచర్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైంది. మద్యం తాగే వివిధ వయసులకు చెందిన 5,12,724 మందిపై చైనాలో అయిదేళ్లపాటు అధ్యయనం చేశారు. ఆసుపత్రుల్లో చేరిన సుమారు లక్ష మందికి పైగా మద్యం బాధితుల ఆరోగ్య సమస్యలను పరిశీలించారు.