ఇటీవల భారత్‌లో పర్యటించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఇక్కడి మార్కెట్ తీరుని క్షుణ్నంగా గమనించినట్లు తెలిపారు. భారత్ మార్కెట్‌పై తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ మార్కెట్ ఓ అద్భుతం అని కొనియాడారు. ఒకప్పటితో పోలిస్తే, భారత్‌లో మధ్యతరగతి కుటుంబాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. వీరిలో కొంతమందైనా ఐఫోన్ కొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత విపణి కీలక దశకు చేరుకుందని తెలిపారు.
యాపిల్‌కు భారత్ ‘‘అద్భుతమైన మార్కెట్’’ అని.. కంపెనీ ప్రధానంగా ఇక్కడి విపణిపై దృష్టి సారించిందని టిమ్ కుక్ తెలిపారు. మార్చితో ముగిసిన మూడు నెలల వ్యవధిలో భారత్‌లో యాపిల్ రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు. వార్షికంగా చూస్తే రెండంకెల వృద్ధితో బలమైన ఫలితాలు నమోదయ్యాయని చెప్పారు. యాపిల్ బ్రాండ్‌పై ఇక్కడి ప్రజలకు ఉన్న ఆసక్తిని తాను ఇటీవలి పర్యటనలో స్పష్టంగా గమనించినట్లు తెలిపారు. భారత విపణిపై ఎంతో ఆశావహంగా ఉన్న కుక్ .. సమావేశంలో దాదాపు 20 సార్లు భారత్ గురించి నొక్కి చెప్పినట్లు సమాచారం.